ప్రచురణ తేదీ : Dec 28, 2017 8:25 PM IST

రివ్యూ రాజా తీన్‌మార్ : ఒక్క క్షణం – బలమైన కథ, సన్నివేశాలు కొద్దిగా బలహీనం

తెరపై కనిపించిన వారు: అల్లు శిరీష్, సురభి, ఆవరసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్

కెప్టెన్ ఆఫ్ ‘ ఒక్క క్షణం: విఐ ఆనంద్

మూల కథ :

జీవ (శిరీష్), జ్యోత్స్న (సురభి) ని షాపింగ్ మాల్ లో చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంతుంది. వారి ప్రేమ అలా కొనసాగుతూవుండగానే జ్యోత్స్న ఉండే అపార్టుమెంట్లో ఉండే శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) ల జంట యొక్క జీవితంలో జరిగే సంఘటనలే వీరి జీవితంలో కూడా జరుగుతున్నాయని గ్రహిస్తారు.

అన్ని గురించి లోతుగా వెళ్లి ఆరా తీయగా ప్యార్లల్ లైఫ్ అనే అంశమే దీనికి కారణమని, అందువల్లనే శ్రీనివాస్, స్వాతిల గతం వీరికి భవిష్యత్తు అవుతోందని తెలుసుకుంటారు. అంతేగాక దాని వలన వారి ప్రేమకి పెను ప్రమాదం ఉందని కూడా కనుగొంటారు. ఇంతకీ ఆ ప్రమాదం ఏమిటి ? అసలు ఈ రెండు జంటల జీవితాలు ఎలా ఒకేలా నడుస్తుంటాయి ? ఆ ప్రమాదాన్ని జీవ ఎలా ఎదుర్కున్నాడు ? చివరికి ప్రేమ, విధిల మధ్య జరిగే సంఘర్షణలో ఏది గెలిచింది ? అనేదే చిత్రం.

విజిల్ పోడు :
–> సినిమా కోసం దర్శకుడు తీసుకున్న ప్యార్లల్ లైఫ్ అనే కాన్సెప్ట్ కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. దేనికి వలనే సినిమా సగం విజయం సాధించింది. కాబట్టి దీనికి మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక కథనాన్ని కూడా ఆసక్తికరంగానే రాసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా రెండవ అర్ధభాగంలో రివీల్ అయ్యే కథలోని కీలక మలుపులు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. కాబట్టి దేనికి రెండవ విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక కథలో కీలకమైన సీరత్ కపూర్, శ్రీనివాస అవసరాల కథ, అందులో వారి పెర్ఫార్మెన్స్ బాగుండగా హీరోగా అల్లు శిరీష్ కొంత మెప్పించాడు. కాబట్టి ఏ అంశాలకి మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా కథ, కథనం బాగానే ఉన్న సన్నివేశాలు మాత్రం బేలగా ఉన్నాయి. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మినహా మిగతా ఏ సన్నివేశం కూడా అంత ప్రభావాన్ని చూపలేకపోయింది.

–> ఫస్టాఫ్, సెకండాఫ్ లు చాలా వరకు కొంత బోర్ గానే నడిచాయి.

–> ఇక ప్రీ క్లైమాక్స్ బాగుంది కాబట్టి క్లైమ్యాక్స్ కూడా అలానే ఉత్కంఠగా సాగుతుందని ఆశించగా అది కాస్త సాగదీసినట్టు ఉండి కొంత చిరాకు పెట్టింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ సినిమాలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన సన్నివేశాలు, అంశాలు కనబడలేదు

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : ప్యార్లల్ లైఫ్ కాన్సెప్ట్ కొత్తగా భలే ఉంది కదా !
–> మిస్టర్ బి : చాలా బాగుంది. కానీ సీన్లే అంత గొప్పగా లేవు.
–> మిస్టర్ ఏ: అవును.. అవి కొంచెం గట్టిగా ఉంటే ఇంకా మంచి సినిమా అయ్యుండేది.

Comments