ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

లై సినిమా నైజాంలో అలా అయ్యింది? నితిన్ కి హోం గ్రౌండ్ లోనే ఇలా అంటే?


శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ నుంచి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే మూడు సినిమాలు మూడు జోనర్ లో భాగానే ఉన్నాయి అనే టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ విషయంలోకి వచ్చేసరికి లై సినిమా లాస్ట్ ప్లేస్ లో ఉంది. నిజానికి తాజాగా పోటీ పడ్డ ముగ్గురు హీరోలలో నితిన్ కాస్తో కూస్తో సీనియర్ హీరో, అలాగే లై సినిమా డైరెక్టర్ కి కూడా ముందు సినిమా మంచి మంచి హిట్ వచ్చి జోష్ మీద ఉన్నవాడే. మిగిలిన వాళ్ళ కి వచ్చేసరికి రానా మాస్ మూవీస్ కి అంతగా సరిపోడని టాక్ ఉండగా, ఆ సినిమా డైరెక్టర్ తేజ మీద ఎవ్వరికి పెద్దగా అంచనాలు లేవు. ఇక జయజానకి నాయకా అయితే ఒక్క బోయపాటి మార్క్ ఉంటుందనే తప్ప దానికి ఎలాంటి స్టార్ ఇమేజ్ లేదు. ఇలాంటి పొజిషన్ కూసింత స్టార్ ఇమేజ్ ఉన్న నితిన్ కి ఓపెనింగ్స్ భాగా వస్తాయని అందరు అనుకుంటారు. అయితే లై సినిమా మాత్రం ఆ అంచనాలని అందుకోలేకపోయింది. ఇక నితిన్ సొంత ఏరియా అయిన నైజాంలోనే ఆ సినిమా తేలిపోయింది. కేవలం ఫస్ట్ డే కలెక్షన్స్ 75 లక్షలతో సరిపెట్టుకుంది. ఇక లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది చూడాలి.

Comments