ప్రచురణ తేదీ : Dec 22, 2017 7:13 PM IST

రివ్యూ రాజా తీన్‌మార్ : హలో – ‘మనసంతా నువ్వే’కు విక్రమ్ మ్యాజిక్ తోడైంది

తెరపై కనిపించిన వారు: అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్

కెప్టెన్ ఆఫ్ ‘హలో’: విక్రమ్ కుమార్

మూల కథ :

అనాథైన శీను (అఖిల్) తన చిన్నప్పటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి ప్రియదర్శిన్) ను ఎంతో అభిమానిస్తాడు. జున్ను కూడా శీను అంటే ఎంతో అభిమానం చూపిస్తుంది. అలా వాళ్ళిద్దరి స్నేహం కొనసాగుతుండగా జున్ను ఢిల్లీ వెళ్లిపోతూ అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటుంది.

కానీ ఆ నెంబర్ ను పోగొట్టుకున్న శీను జున్ను ఎప్పటికైనా తిరిగొస్తుందని 13 ఏళ్ల నుండి ఎదురుచూస్తూనే ఉంటాడు. అలా ఎదురుచూపుల్లో ఉన్న శీనును జున్ను ఎలా కలిసింది ? ఆమెను చేరుకోవడానికి శీను ఎలాంటి సాహసాలు చేశాడు ? విధి వాళ్ళిద్దర్నీ ఎలా కలిపింది ? అనేదే కథ.

విజిల్ పోడు :

–> సినిమా ఫస్టాఫ్ చాలా బాగుంది. హీరో, హీరోయిన్ల చిన్నప్పటి స్నేహం, వాళ్ళు విడిపోవడం, హీరో ఆమె కోసమే ఎదురుచూస్తుండటం, హీరో ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలు చాలా బాగా కనెక్టయ్యాయి. కాబట్టి మొదటి విజిల్ ఫస్టాఫ్ కు వేసుకోవచ్చు.

–> ఇక హీరోగా అఖిల్ చాలా పరిణితి చూపించాడు. నటన, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, డాన్సులు, స్టంట్స్ అన్నింటిలోనూ మెప్పించాడు. ఒక హీరోగా పూర్తిగా సెక్స్ అయ్యాడు. కాబట్టి రెండో విజిల్ ఆయనకే వేయాలి.

–> దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రేమ కథకు యాక్షన్ ను, ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించిన విధానం బాగావుంది. కాబట్టి మూడో విజిల్ ఆయనకే వేయాలి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ కు వచ్చేసరికి కథనం నెమ్మదించడంతో కొంత ఆసక్తి తగ్గింది.
–> కథలో పట్టున్నా హీరో హీరోయిన్ల పాత్రల్లో ప్రేమ తాలూకు తీవ్రత పెద్దగా కనబడలేదు.
–> ఇక 13 ఏళ్ళ పటు నిరీక్షించిన ప్రేమికులు చివగా కలుసుకునేప్పుడు ఉండే ఇంటెన్సిటీ, భావోద్వేగాలు ఎక్కువగా కనబడలేదు. పైగా స్టోరీ అంతా మనసంతా నువ్వే స్టోరీలానే ఉంటుంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ సినిమాలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన సన్నివేశాలు, అంశాలు కనబడలేదు.
చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : అఖిల్ కు ఇది పర్ఫెక్ట్ రీ లాంచ్
–> మిస్టర్ బి : కానీ సినిమా ‘మనసంతా నువ్వే’ స్టోరీలా అనిపిస్తోంది.
–> మిస్టర్ ఏ: అది నిజమే. కానీ ఇక్కడ విక్రమ్ కుమార్ మ్యాజిక్ తోడైందిగా.

Comments