ప్రచురణ తేదీ : Oct 26, 2017 4:41 PM IST

మహేష్ సినిమా ఆడకపోవడానికి కారణం నేనే అంటున్న దర్శకుడు !

మహేష్ బాబు ఇప్పుడు ఉన్న టాప్ హీరోల్లో ఒకరు. ఆయన నటించిన తాజ్ చిత్రాలు ‘బ్రహ్మోత్సవం, స్పై డర్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాదించనప్పటికి ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నచేస్తున్న ‘భరత్ అనే నేను’ హక్కులు భారీ ధరలు పలకడమే ఇందుకు నిదర్శనం. ఇకపోతే గతంలో మహేష్ తో ‘టక్కరి దొంగ’ సినిమాను తీసిన దర్శకుడు జయంత్ సీ పరాంజీ తాజాగా ఆ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు..

‘టక్కరి దొంగ’ సినిమా షూటింగ్ సమయంలో పూర్తి స్క్రిప్ట్ లేకుండానే సెట్స్ పైకి తీసుకెళ్లారు సినిమాను, సో ఒకవైపు స్క్రిప్ట్ పనులు చేస్తూ, మరోవైపు షూటింగ్ జరుపుకోవడంతో సినిమా ఫలితం తలక్రిందులు అయ్యిందని, సినిమా అడకపోవడానికి కారణం తానే అని వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆయన పై విధంగా స్పందించారు. జయంత్ ఇటీవల గంటా రవితేజ తో ‘జయదేవ్’ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Comments