ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

బిగ్ బాస్ దెబ్బకి జీరోగా మారిపోయిన సన్నీలియోన్ బాయ్ ఫ్రెండ్?


బిగ్ బాస్ షో ఇండియాలో ఎక్కువ పాపులర్ అయిన రియాలిటీ షో.. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రేటీస్ తమ గుర్తింపుని అమాంతం పెంచుకున్నారు. మొదట చిన్న చిన్న సినిమాల్లో చేసిన వారు కూడా బిగ్ బాస్ పుణ్యమా అని పెద్ద స్టార్స్ అయిపోయారు. అలా బిగ్ బాస్ షో ద్వారానే పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెలానే ఎంతో మంది నటులు బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలు అందుకొని మంచి స్థానంలో నిలబడ్డారు. అలాగే బిగ్ బాస్ ప్రాంతీయ భాషల్లో కూడా కొంత మంది బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగులో మాత్రం బిగ్ బాస్ ఒక హీరో కెరియర్ ని నాశనం చేసిందనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా భాగా పాపులర్ అయ్యి, కరెంట్ తీగ సినిమాలో సన్నీ లియోన్ బాయ్ ఫ్రెండ్ గా చేసి బర్నింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో సంపూర్నేష్ బాబు బిగ్ బాస్ దెబ్బకి ఒక్క సారిగా తెలుగు రాష్ట్రాల్లో జీరో అయిపోయాడు.

బిగ్ బాస్ కి ముందు అతనికి సినిమా అవకాశాలు భాగా వచ్చేవి. ఓ వైపు హీరోగా చిన్న సినిమాలు చేస్తూ మరో వైపు పెద్ద సినిమాల్లో కమెడియన్ గా క్లిక్ అయ్యే పనిలో ఉన్నాడు. అయితే ఒక్క బిగ్ బాస్ షో అతన్ని హీరో నుంచి జీరోగా మార్చేసింది. ఇప్పటి వరకు అతని గురించి జనాలని పూర్తిగా తెలియక పోవడం వలన సంపూ అంటే కమెడియన్ గా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కుర్రాళ్ళు ఫీల్ అయ్యేవారు. అయితే బిగ్ బాస్ లో అతను మానసికంగా క్రుంగిపోయి అర్ధంతరంగా ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా బయటకు వచ్చేయడంతో అతని ఇమేజ్ ఒక్క సారి సోషల్ మీడియాలో డ్రాప్ అయ్యిపోయింది. ఇంత కాలం సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అయిన వాళ్ళు అతని మానసిక ధృడత్వం లేని మనిషిగా ఫిక్స్ అయిపోయారు. అలాంటి వ్యక్తి హీరోగా అన్ ఫిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు సంపూ అంటే యూత్ లో ఉన్న క్రేజ్ బిగ్ బాస్ తర్వాత అమాంతం డ్రాప్ అయిపోవడం. అతన్ని ఇండస్ట్రీలో కూడా దూరం పెట్టారనే టాక్ వినిపిస్తుంది. ఇలా బిగ్ బాస్ షో షార్ట్ కట్ లో హీరోగా ఇమేజ్ పెంచుకున్న బర్నింగ్ స్టార్ ని జీరోని చేసేసింది అని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అందరు అనుకుంటున్నారు. మరి తెలుగు బిగ్ బాస్ షో ఎంత మంది ఇమేజ్ పెంచుతుందో.. ఎంత మంది ఇమేజ్ దించుతుందో చూడాలి.

Comments