ప్రచురణ తేదీ : Oct 13, 2018 11:29 AM IST

క్లీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ : 35కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్

ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` ఇరు తెలుగు రాష్ట్రాల్లో 35కోట్ల షేర్‌, 60కోట్ల మేర గ్రాస్ వ‌సూలు చేసింది. ఇవి కేవ‌లం రెండ్రోజుల వ‌సూళ్ల లెక్క‌లు మాత్ర‌మే. మునుముందు ద‌స‌రా సెల‌వులు క‌లుపుకుని ఈ సినిమా మ‌రింత‌గా వ‌సూళ్ల ధ‌మాకా మోగిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఓవ‌ర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో బుధ‌వారం -790కె డాల‌ర్లు, గురువారం- 229కె డాల‌ర్లు క‌లుపుకుని ఓవ‌రాల్‌గా 1.02 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలైంద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెలిపారు. ఇది 7.50 కోట్లుగా లెక్క తేలింది.

ఏపీ -నైజాం ఓవ‌రాల్‌గా రెండు రోజుల వ‌సూళ్లు విడిగా ప‌రిశీలిస్తే.. ఏపీ-తెలంగాణ క‌లుపుకుని డే2లో – 7.95కోట్ల గ్రాస్ వ‌సూలైంది. రెండో రోజు షేర్ ప‌రిశీలిస్తే.. నైజాం-8.55కోట్లు, సీడెడ్- 7.44కోట్లు, నెల్లూరు-1.33కోట్లు, గుంటూరు -4.82కోట్లు, తూ.గో-3.24కోట్లు, ఉత్త‌రాంధ్ర -4.01కోట్లు, ప‌.గో-2.69కోట్లు, కృష్ణ‌-2.51కోట్లు, ఏపీ-తెలంగాణ క‌లుపుకుని రెండ్రోజుల‌కు 34.59కోట్లు వ‌సూలైంది. డే1 ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి నైజాం-2.83కోట్లు, సీడెడ్ -1.96కోట్లు, నెల్లూరు -0.27కోట్లు, ఉత్త‌రాంధ్ర‌-0.88కోట్లు, తూ.గో జిల్లా-0.47కోట్లు, ప‌.గో జిల్లా-0.32కోట్లు, కృష్ణ‌-0.54కోట్లు, గుంటూరు-0.67కోట్లు వ‌సూలైంది. ఈ మొత్తం రెండు రోజుల‌కు క‌లుపుకుని దాదాపు 35కోట్ల షేర్ వ‌సూలైంది. గ్రాస్ దాదాపు 60కోట్లు ఉంటుంద‌ని ఓ అంచ‌నా.

Comments