ప్రచురణ తేదీ : Thu, Oct 26th, 2017

2.O అప్‌డేట్‌ : మేక‌ప్ కోస‌మే ఐదు గంట‌లు?

మేక‌ప్ కోసం గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించ‌డం అంటే ఆషామాషీ కాదు. అందుకు ఆర్టిస్టులో చాలా స‌హ‌నం కావాలి. అయితే ఎంతో ఓర్పు-స‌హ‌నం ఉన్న స్టార్లుగా క‌మల్ హాస‌న్‌, అమీర్‌ఖాన్‌, చియాన్ విక్ర‌మ్ వంటి స్టార్లు ఇప్ప‌టికే ప్రూవ్ చేసుకున్నారు. భార‌తీయుడు గెట‌ప్ కోసం క‌మ‌ల్‌హాస‌న్ .. అప‌రిచితుడు, ఐ చిత్రాల్లో విభిన్న‌మైన వేష‌ధార‌ణ‌ల కోసం చియాన్ విక్ర‌మ్ మేక‌ప్ కోసం గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించి పాత్రల్లోకి ప‌ర‌కాయం చేశారు. అందుకే ఆ క్యారెక్ట‌ర్స్ అన్నీ ఎంతో గొప్ప‌గా పండాయి. ఇప్ప‌టికీ బుల్లితెర‌పై ఆ పాత్ర‌ల్లో స‌ద‌రు హీరోల న‌ట‌నాభిన‌యాన్ని వీక్షించి ఆశ్చ‌ర్య‌పోతున్నాం.

అయితే అంత‌కుమించి 2.ఓ పాత్ర‌ల మేక‌ప్ ఎలివేట్ కానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంలో అత్యంత కీల‌క‌మైన ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌, ఎమీ జాక్స‌న్ క్యారెక్ట‌ర్ల లుక్ ను రివీల్ చేశారు శంక‌ర్‌. ఇక అన్ని పాత్ర‌ల్లోనూ కిలాడీ అక్ష‌య్ విభిన్న‌మైన గెట‌ప్‌తో స‌రికొత్త ఆహార్యంతో క‌నిపిస్తున్నాడు. అయితే ఈ గెట‌ప్ అంత ఆషామాషీ కానేకాదుట‌. ఆ రూపం తెచ్చేందుకు అక్కీ రోజూ ఐదు గంట‌ల పాటు కేవ‌లం మేక‌ప్‌కే కేటాయించేవాడుట‌. మూడున్న‌ర గంట‌ల పాటు మేక‌ప్ వేస్తే, గంట‌న్న‌ర పాటు ఆ మేక‌ప్ తొల‌గించేందుకే ప‌ట్టేదిట‌. అంటే ఐదు గంట‌ల స‌మ‌యం కేవ‌లం మేక‌ప్ వేసి తీసేందుకే వృథా అయ్యేది. అయితే అంత‌గా శ్ర‌మించినందుకు ఆ రూపం ప్రేక్ష‌కాభిమానుల్లో ఇప్ప‌టికే ఎంతో క్యూరియాసిటీ పెంచింది. డా.రిచ‌ర్డ్ పాత్ర‌లో న‌టిస్తున్న అక్ష‌య్ అత్యంత క్రూరుడైన విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు ఈ చిత్రంలో. నేడు దుబాయ్‌లో జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో అక్ష‌య్ మాట్లాడుతూ.. త‌న పాత్ర ఏంటి? అనేది ఎక్కువ‌గా రివీల్ చేయ‌లేన‌ని, ఒక‌వేళ అలా చేస్తే శంక‌ర్ త‌న పారితోషికం కోసేస్తార‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. శంక‌ర్ ఎలా చెబితే అలా చేశాన‌ని, అస‌లు ఆ పాత్ర‌లో న‌టించేందుకు శిక్ష‌ణ అవ‌స‌రం ప‌డ‌లేద‌ని వెల్ల‌డించాడు. శంక‌ర్ బోలెడంత హోమ్‌వ‌ర్క్ చేసి .. త‌న పాత్ర‌ని తీర్చిదిద్దార‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.

Comments