ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

జగన్ చెప్పాలే కానీ ఆ పని చిటికెలో అయిపోదూ..!


ఏపీ ప్రత్యేక హోదా అంశం జగన్ వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి వచ్చింది. మొదట తన ఎంపీల చేత రాజీనామా చేయించి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. కేవలం రాజకీయ ఉనికి కొరకే జగన్ యువభేరి సభల పేరుతో ప్రజలని మభ్యపెట్టేలా రాజీనామా వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు టీడీపీ నేతలు వాదిస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఏపీలో ప్రత్యేక హోదా గురించి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీడీపీ రెండూ మరచిపోయాయి. ఈ అంశాలన్నీ తెర మీదికి తీసుకువచ్చే సమయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టె విధంగా ఉండాలేకాని తాను తవ్వుకున్న గోతిలో తానే పడకూడదని రాజకీయ నిపుణులు జగన్ ని హెచ్చరిస్తున్నారు. గతంలో ప్రత్యక హోదా కోసం తన ఎంపీలచే రాజీనామా చేయిస్తానని ప్రకటించిన జగన్ ఆ తరువాత మోడీతో కాంప్రమైజ్ అయ్యారనే అపవాదు ఉంది. మళ్లీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడం అంటే ఏరికోరి చిక్కులు కొనితెచ్చుకున్నట్లే అని అంటున్నారు.

ఇదిలా ఉండగా వైసిపి ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాత్రం రాజీనామాకు సై అంటున్నారు. తమ అధినేత రాజీనామా చేయమని చెప్పిన మరుక్షణం తాము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడం ఆవేశపూరితమైన చర్య మాత్రమే అవుతుందని అన్నారు.

Comments