ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

ధోనిని కొడుకు పొగిడాడు…. తండ్రి తిట్టాడు…!

dhoni
ధోనికి, యువరాజ్ సింగ్ కి అసలు పడట్లేదని చాలా మంది అనుకునేవారు. యువరాజ్ క్యాన్సర్ వ్యాధి నుండి కోలుకున్నాక జట్టులో నిలకడగా ఉండడంలేదు. సెలెక్టర్లు అతనికి అవకాశం కల్పించడంలేదు.ఇప్పుడు ధోని తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవడంతో సరిగ్గా అదే సమయంలో యువరాజ్ సింగ్ చాలా నెలల తరువాత ఇంగ్లాండ్ టూర్ కి సెలెక్ట్ కావడం ఒకేసారి జరగడంతో అందరూ ధోని..యువరాజ్ మధ్య విభేదాలు నిజమేనేమో అని చర్చించుకుంటున్నారు. ధోని రిటైర్మెంట్ నేపథ్యంలో యువరాజ్ చేసిన ఒక వీడియోలో మాత్రం వీళ్ళిద్దరూ సన్నిహితంగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు పొగుడుకోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ధోని కెప్టెన్సీలో ఆడడం తన అదృష్టమని యువరాజ్ అంటే… నీలాంటి మంచి క్రికెటర్లు ఉండడం వల్లే విజయాలు సాధించానని ధోని అన్నాడు. దీంతో ఇద్దరు అభిమానులు పండగ చేసుకున్నారు.

అయితే యువరాజ్ తండ్రి యోగరాజ్ మాత్రం ధోనిని ఇప్పటికీ విమర్శిస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి ధోని కెప్టెన్ గా ఉన్నంతకాలం యువరాజ్ సింగ్ ఇండియన్ టీంకు సెలెక్ట్ కానివ్వడని విమర్శించిన సంగతి తెలిసిందే… తాజాగా ధోని కెప్టెన్ గా తప్పుకున్నాక యువరాజ్ సింగ్ ఇండియన్ టీంకు సెలెక్ట్ కావడంతో తాను ఇలా జరుగుతుందని ఇంతకుముందే చెప్పానని అదే జరిగిందని యోగరాజ్ అన్నారు. మొత్తానికి ధోనిని కొడుకు పొగుడుతుంటే.. తండ్రి మాత్రం తిడుతున్నాడు.

Comments