రివ్యూ రాజా తీన్‌మార్ : యుద్ధం శరణం – ‘సాహసం శ్వాసగా సాగిపో’ ని ఇంకో రకంగా తీశారు

తెరపై కనిపించిన వారు : నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి
కెప్టెన్ ఆఫ్ ‘యుద్ధం శరణం’ : కృష్ణ మరిముత్తు

మూల కథ :

అర్జున్(నాగ చైతన్య) కు తన అమ్మ సీత(రేవతి), నాన్న మురళీ కృష్ణ(రావు రమేష్), ప్రియురాలు అంజలి(లావణ్య త్రిపాఠి) అక్క, భావ, చెల్లితో కలిసి ఆనందంగా ఉంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి అర్జున్ జీవితంలోకి అనుకోకుండా కష్టం వచ్చి అతని అమ్మ, నాన్న చనిపోతారు.

వారి చావుకి నాయక్(శ్రీకాంత్) అనే రౌడీ కారణం అని అర్జున్ తెలుసుకుంటాడు. అసలు నాయక్, అర్జున్ అమ్మ, నాన్నని ఎందుకు చంపాడు? ఆ విషయం అర్జున్ కి ఎలా తెలుస్తుంది? తన అమ్మ, నాన్న చావుకి కారణం అయిన నాయక్ మీద అర్జున్ ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే తెరపై నడిచే సినిమా..

విజిల్ పోడు :

⤏ దర్శకుడు మరిముత్తు కుటుంబంతో కలిసి ఆనందంగా ఉన్న ఒక అబ్బాయి జీవితంలోకి ఒక రౌడీ ప్రవేశించి అతని సంతోషాన్ని ఎలా దూరం చేశాడు, దానికి ఆ కుర్రాడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే అంశాన్ని బాగానే హ్యాండిల్ చేశాడు. కనుక అతనికి మొదటి విజిల్ వేసుకోవచ్చు.

⤏ ఇక ఫస్టాఫ్ మొత్తం హీరో ఫ్యామిలీ చుట్టూ అల్లిన ఎమోషన్స్, వాటిని అందంగా చూపించడం ఆకట్టుకున్నాయి. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచింది. కనుక వీటికి రెండో విజిల్ వేయొచ్చు.

⤏ హీరో నాగ చైతన్య నటన ఇందులో బాగుంది. సినిమా సినిమాకు అతనిలో ఇంఫ్రూమెంట్ కనిపిస్తోంది. ఈ కథలో చైతన్య ఉండటం వలన సినిమాకు బాగా ప్లస్ అయింది. కనుక చైతన్యకు మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

⤏ ఫస్టాఫ్ బాగానే ఉంది సెకండాఫ్ కూడా బాగానే ఉంటుందేమో అనుకుంటే దర్శకుడు మరిముత్తు దానికి భిన్నంగా రెండవ అర్ధభాగాన్ని బోరింగా తీసేశారు.

⤏ అలాగే ఆరంభంలో బలంగా కనబడిన విలన్ శ్రీకనట్ సెకండాఫ్లో తేలిపోవడం, అన్ని పరిస్థితులు హీరోకు అనుకూలంగానే జరుగుతుండటం నిరుత్సాహానికి గురిచేసింది.

⤏ హీరో విలన్ తో యుద్ధం ఆరంభించడం బాగున్నా ఆ యుద్దాన్ని చేసిన తీరు చాలా బలహీనంగా ఉంది. దీంతో సినిమాలో తీవ్రత లోపించి సాదాసీదాగా తయారైంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

⤏ సెకండాఫ్లో ప్రతినాయకుడు శ్రీకాంత్ మరీ అంతలా తేలిపోవడం సినిమాను బలహీనంగా చేయడమేగాక కాస్త వింతగా కూడా అనిపించింది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఇంతకీ సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : నాకైతే ‘సాహసం శ్వాసగా సాగిపో’ ని ఇంకో రకంగా తీసినట్టు అనిపించింది.
మిస్టర్ ఏ : క్యారెక్టర్స్ మారాయంతే కదా !
మిస్టర్ బి : యస్.

Comments