పాదయాత్రలో మరో ఇబ్బంది..జగన్ కు నడుం నొప్పి..!

జగన్ పాదయాత్రలో మరో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. జగన్ పాదయాత్ర మూడవ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ఆరంభ దశలోనే జగన్ కు నడుం నొప్పి సంభవించడంతో వైసిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొని ఉంది. రెండవరోజు జగన్ వేంపల్లికి చేరుకున్న నేపథ్యంలో నడుం నొప్పి వస్తోందని అనుచరులకు తెలియజేసారు. జగన్ అనుచరులు వెంటనే తిరుపతి నుంచి ఫియోజి థెరపిస్టుని రప్పించి ప్రథమ చికిత్స నిర్వహించారు.

నడుం నొప్పి తీవ్రతరం కాకుండా బెల్టు ధరించాలని ఫియోజి సూచించారు. దీనితో బెల్టు ధరించిన జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలలపాటు 125 నియోజకవర్గాలు కలిసేలా 3 వేల కిలోమీటర్ల పాదయత్రని జగన్ ప్రారంభించారు. మొదట్లోనే జగన్ శారీరక ఇబ్బందులని ఎదుర్కొనడంతో ఆపార్టీ వర్గాలు ఆందోళన చెడుతున్నాయి. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ పాదయాత్ర పూర్తి చేస్తారని అయన అనుచరులు చెబుతున్నారు.

Comments