ప్రచురణ తేదీ : Jan 31, 2018 10:56 PM IST

వీడియో : పవన్ కళ్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వై ఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం తమపై ఏమాత్రం ఉండబోదని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనే మోడీ, చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిస్తే కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఊరూరా తిరిగి టిడిపికి ఓటు వేయమని అడిగారని, పవన్ అభిమానులు టిడిపికే ఓటు వేశారని అన్నారు.

2019 లో పవన్ కళ్యాణ్ వలన తమకు ప్రత్యేకంగా వచ్చే నష్టం ఏమి లేదని అన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమస్య చంద్రబాబే అని జగన్ మరో మారు పునరుద్ఘాటించారు. టీడీపీ నేతలు రాబందుల్లా రాష్ట్రంలోని భూములని కబ్జా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. 1000 కిమీ పూర్తైన అనంతరం జగన్ పాదయాత్ర ఉత్సాహభరితంగా సాగుతోంది.

Comments