అక్రమాస్తుల కేసుపై జగన్ కు మళ్ళీ శిక్ష పడనుందా..?

అక్రమాస్తుల కుంభకోణాలు, ప్రజల సొమ్ము నిలువు దోపిడీలకి ఒకప్పుడు మారు పేరుగా మారిన జగన్ కేసు ఇంకా కొలిక్కి రాకపోవడానికి అసలు కారణమేంటి..? వేలకోట్లు కాజేసి దర్జాగా మళ్ళీ మహారాజులా ప్రజల్లో ప్రజా సంకల్ప యాత్ర అంటూ రాష్ట్రమంతా పాదయాత్రలు చేస్తున్నాడు వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్. తను అక్రమంగా సంపాదించిన నల్లధనంపై కోర్టులో మగ్గుతున్న కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే చ్గాలా రోజుల తర్వాత ఈ అంశంపై సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసన్ హాజరయ్యారు. కేసుకు సంబందించిన వివరాలు మట్టుకు విచారణ పూర్తి అయ్యాక బయట పెడతామని సీబీఐ వెల్లడించింది.

Comments