ప్రచురణ తేదీ : Thu, Aug 10th, 2017

ప్రత్యర్ధి మీద గెలిచి.. నిర్లక్ష్త్యనికి బలైపోయాడు! ఇది ముగిసిన ఆటగాడి కథ!

మన ఇండియాలో క్రీడాకారులు, వారికి అందించే సౌకర్యాల మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనే విషయం ఎవరిని అడిగిన చెబుతారు. అలాంటి నిర్లక్ష్యం కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక రెజ్లర్ జీవితం అర్ధంతరంగా ముగిసింది. తాను ప్రాక్టీస్ చేసే స్టేడియంలోనే విద్యుత్ షాక్ తో ప్రాణాలు వదిలేయడం అందరినీ కలచివేసింది. జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ అధీనంలోని స్టేడియంలో భారీ వర్షం కారణంగా వర్షం నీరు చేరింది. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆ నీటిలో విద్యుత్ ప్రవహిస్తుంది. విషయం గ్రహించని 25 ఏళ్ల రెజ్లర్ విశాల్ కుమార్ ప్రాక్టీస్ కి నీటిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నీటిలో అపస్మార స్థితిలో పడివున్న విశాల్ ను అక్కడి వారు సర్దార్ ఆసుపత్రికి తీకుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా నాథ్ సింగ్ తెలిపారు. నిండా నీటిలో మునిగివున్న స్టేడియం కార్యాలయంలోకి ఆయన ఎందుకు వెళ్లాడో తెలియడం లేదని అన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ అయిన కూడా పవర్ కట్ చేయకుండా అలా వదిలేసినా నిర్వాహకుల లోపం కారణంగానే విశాల్ కుమార్ చనిపోయాడని తోటి క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. అయితే అతని కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి జార్ఘండ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార ప్రతినిధులు చెప్పడం విశేషం.

Comments