ప్రచురణ తేదీ : Thu, Aug 10th, 2017

మన్మధ సినిమా కథని మరో సారి గుర్తుచేసిన యువకుడు! కాకుంటే సీన్ రివర్స్!

శింబు నటించిన మన్మధా సినిమా చూసిన ఎవరికైనా అందులో ఓ సన్నివేశం భాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమించిన అమ్మాయి, సీరియస్ అయ్యి వెళ్ళిపోవడంతో, ఆమెని కలవాలని, సారీ చెప్పాలని వెళ్ళిన హీరోకి అక్కడ హీరోయిన్ వేరొక యువకుడితో సన్నిహితంగా ఉండటం కనిపిస్తుంది. అది చూసి తట్టుకోలేక హీరో ఆ ఇద్దరిని చంపేస్తాడు. ఇప్పుడు ఇదే సీన్ హైదరాబాద్ లో రిపీట్ అయ్యింది. ప్రేమించిన యువతి, తన మీద కోపంతో దూరం పెట్టడం తట్టుకోలేకపోయిన అబ్బాయి. ఎలా అయిన ఆమె పుట్టిన రోజున అమ్మాయిని కన్విన్స్ చేయాలని ఆమె హాస్టల్ కి వెళ్ళిన అతనికి అనుకోని విధంగా ఆమె వేరొక యువకుడితో ఉండటం చూసి తట్టుకోలేక పోయాడు. ఇక్కడ ఆ యువకుడే సూసైడ్ లెటర్ రాసి, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆ అమ్మాయి గురించి అందరికి తెలిసినట్లు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే సింగరేణి ఎస్సార్సీ-3 గనిలో పనిచేసే మేకా మల్లయ్య చిన్న కుమారుడు నరేష్. ఎంబీఏ వరకూ చదివి, ఆపై చెన్నై క్యాప్ జెమినీ సంస్థలో ప్రాసెస్ అసోసియేట్ గా చేరాడు. శ్రీరాంపూర్‌లోని కృష్ణాకాలనీకి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ఎంబీఏ చదువుకుని హైదరాబాద్ లో పని చేస్తుండగా, చెన్నైలోని ఉద్యోగాన్ని ఆమె కోసం వదులుకుని హైదరాబాద్ కు మకాం మార్చాడు. నాలుగేళ్ల పాటు వారు కలసి తిరిగారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో… ఇద్దరి మధ్యా ప్రేమ బెడిసికొట్టింది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది లేదని ఆమె తెగేసి చెప్పింది. దీన్ని నరేష్ తట్టుకోలేకపోయాడు. సోమవారం నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో కలుద్దామని అడిగాడు. ఉదయం పూట తన అన్నయ్య వస్తున్నాడని, బయటకు రాలేనని, సాయంత్రం కలుస్తానని చెప్పింది. సాయంత్రం వరకూ వేచి చూడలేక, ముందుగానే ఆమె ఉన్న హాస్టల్ వద్దకు వెళ్లాడు నరేష్ కి ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం కనిపించింది.

అది చూసి తట్టుకోలేకపోయిన నరేష్ ఈ మొత్తం విషయాన్ని పేస్ బుక్ లో పెట్టి వారి ముగ్గురు పేర్లు, అమ్మాయితో నరేష్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి సికింద్రాబాద్ లో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి, హసన్ పర్తి చేరుకుని అక్కడ రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆ యువకుడు మృతికి కారణం అయిన ఆమెమీద ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఆత్మహత్యకి ముందు నరేష్ పెట్టిన సూసైడ్ లెటర్ వైరల్, ఫోటోలు వైరల్ కావడంతో ఆమె నెటిజన్స్ ఆమె మీద సీరియస్ అవుతున్నారు. ఆ కొడుకుని నమ్ముకొని ఉన్న తల్లిదండ్రులు నీ వల్ల ఒంటరైపోయారని ఆవేదన భరితంగా విమర్శిస్తున్నారు. మరి ఆ ఆత్మహత్యపై ఆ అమ్మాయి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎప్పుడు మహిళలకి అన్యాయం జరిగిపోతుంది గోల చేసి మహిళా సంఘాలు, మీడియా వారు ఆ యువకుడు చావుపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Comments