ప్రచురణ తేదీ : Jan 10, 2018 7:35 AM IST

బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్..తండ్రి గుండె ఆగినా కరగని కూతురి హృదయం..!

యువతి యువకుల విచ్చలవిడి తనానికి, కుటుంబ సంబంధాలు మంటగలసిపోతున్నాయనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. బాయ్ ఫ్రెండ్ తో కలసి గదిలో కుమార్తె చేస్తున్న పని చూసిన తండ్రి నిర్ఘాంతపోయాడు. వెళ్లి ఆమె బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడడంతో ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటన నోయిడాలో జరిగింది.

విశ్వనాథ్ సాహు (45), తన భార్య కుమార్తె పూజ (21) తో కలసి ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. వీరి పక్క ఇంటిలో ఉండే ధర్మేంద్ర (24) అనే యువకుడితో పూజకు ఏడాది కాలం నుంచి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి శారీరక సంభందం వరకు వెళ్ళింది. ఇటీవల అర్థరాత్రి కుమార్తె గది నుంచి అలికిడి వినిపించడంతో తండ్రి వెళ్లి గమనించాడు. కూతుర్ని ఎలాంటి పరిస్థితుల్లో చూడకూడదో అలాంటి పరిస్థితుల్లోనే చూడవలసి వచ్చింది. పూజ ప్రియుడితో శృంగారం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీనితో ఆమెప్రియుడిపై దాడికి దిగే క్రమంలో అతడు మెట్ల పై నుంచి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా పూజ తండ్రి గుండె ఆగి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు పూజని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రియుడు పరారీలో ఉన్నాడు. జరిగింది ఎదో జరిగిపోయింది.. ఇపుడెందుకు రాద్ధాంతం అంటూ పోలీస్ లని పూజా ప్రశ్నించడంతో అక్కడ ఉన్న వారంతా నివ్వెరపోయారు.

Comments