ఇంకో మూడు నాలుగు వారాల్లో జగన్ అసలు భాగోతం బయట పెడతా..!

ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు చైర్మన్ కుటుంబ రావు గారు ఈ రోజు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మరియు ఆయన ఛానల్ సాక్షి మరియు సాక్షి పత్రికలో వస్తున్న కథనాలు మీద తీవ్రంగా మండిపడ్డారు.వై ఎస్ జగన్ పాదయాత్రకు జనం ఎవరు రావట్లేదని వారి పత్రికలో ఎలాంటి వార్తలు ప్రచురించాలో తెలీక అమరావతి పై ఏదొక అబద్ధపు ప్రచారం చెయ్యాలని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు,జగన్ తన మీడియాతో ఆర్ధిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.

ఇంకో కేవలం మూడు నాలుగు వారాల్లో జగన్మోహన్ రెడ్డి మరియు అతని కంపెనీల యొక్క తాజా భాగోతాన్ని మీ అందరి ముందు బయటపెడతానని,జగన్మోహన్ రెడ్డి మొహం కూడా చూపించుకోలేని స్థాయిలో ఉంటుందని విరుచుకుపడ్డారు,పైకి ఎదో నిజాయితీ పరులులా బయట మొహానికి మంచి అనే ముసుగు వేసుకొని తిరగడం కాదని,జగన్ యొక్క కొత్త జాతం 3 నుంచి 4 వారాల్లో రాబోతుందని,తాను ఏ విధమైనటువంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చెయ్యను అని సాక్షి మీడియా వారికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా అంటూ మీరు ప్రచురించే కథనాల్లో ఏ మాత్రం ఐనా నిజం ఉందా అని ప్రశ్నించారు.జగన్ మరియు విజయ్ సాయి రెడ్డి ఎన్ని కోట్లు దోచుకున్నారో అన్ని బయటపెడతా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments