ప్రచురణ తేదీ : Jul 28, 2018 4:49 PM IST

టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో తీవ్ర విషాదం!

తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి అన్నపూర్ణ ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆమె కూతురు కీర్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. గత కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కీర్తి మానసిక వేదనకు లోనై బలవన్మరణానికి పాల్పడినట్లు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. మూడేళ్ళ క్రితం బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న కీర్తి అతనితో విభేదాలు రావడం వల్ల హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇంకా ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Comments