ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

జగన్ కి గుర్నాధ రెడ్డి స్ట్రోక్! త్వరలో జంపింగ్ గ్యారెంటీ?


చంద్రబాబు ఆకర్శ ఇప్పుడు వైసీపీలో గుబులు పుట్టిస్తుంది. ఓ వైపు మైండ్ గేమ్ తో చంద్రబాబు వేస్తున్న ప్లాన్స్ ముందు వైసీపీ నాయకులు హడాలిపోతున్నట్లు తెలుస్తుంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు టీడీపీకి జంప్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని, కరెక్ట్ గా జగన్ లండన్ వెళ్ళడం ఇప్పుడు వారికి మంచి అవకాశం దొరికినట్లు అయ్యింది. ఈ నేపధ్యంలో అనంతపురం జిల్లాలో వైసీపీ కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి ఎ క్షణం అయిన టీడీపీలో జంప్ అవడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అతను చంద్రబాబుతో టచ్ లో ఉన్నట్లు అవకాశం చూసుకొని పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నాడనే సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడలో ఓటమి అనంతరం చాలా మంది నాయకులు పార్టీ అధిష్టానం మీద అసంతృప్తి ఉన్నారని తెలుస్తుంది. ప్రజల్లో పార్టీ మీద, నాయకత్వం మీద ఇప్పటికి పూర్తి స్థాయి విశ్వాసం లేదని ఈ ఎన్నికల ద్వారా స్పష్టం అయ్యిందని, ఇప్పటికి కూడా పార్టీ అధిష్టానం తప్పొప్పులని సరిచూసుకోకుండా ప్రత్యర్ధి పార్టీల మీద ఓటమి కారణాన్ని నెట్టేసే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఎవరికీ మింగుడు పడని విషయం మారిందని సమాచారం. ఈ నేపధ్యంలో వైసీపీ నుంచి ముందుగా గుర్నాథ్ రెడ్డి టీడీపీలోకి జంపింగ్ ఖాయం అని అంటున్నారు. ఇతనికి అనంతపురంలో జీసి వర్గంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపధ్యంలో వారు ద్వారా జగన్ నుంచి అతను దూరం అవుతుననడనే సమాచారం వినిపిస్తుంది. మరో వైపు సీమ నుంచి చాలా వరకు వైసీపీ ని వీడెందుకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే అధినాయకుడు స్థానికంగా లేకపోవడంతో మిగిలిన వైసీపీ నాయకులు అందరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది.

Comments