ప్రచురణ తేదీ : Sun, Aug 13th, 2017

నంద్యాలలో జగన్ కి అనుకూలంగా మారుతున్న సమీకరణాలు? ఎలా అంటే?


ప్రస్తుతం ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అటు అధికార పార్టీ, ఇటు వైసీపీ సమ ఉజ్జీలుగా పోటీ పడుతున్నాయి. గెలుపు కోసం రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మాట ప్రకారం ఏపీలో నంద్యాలలో జగన్ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అసలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలని చంద్రబాబు నెరవేర్చకుండా ప్రజలని మోసం చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది విశ్వసిస్తూ ఉండటంతో పాటు. అధికారంలో ఉండి మూడు దగ్గర అవుతున్న అసలు నంద్యాల ప్రజల కోసం ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, ఆపై భూమా కుటుంబం టీడీపీలో చేరిన తర్వాత కూడా కేవలం ఆ కుటుంబానికి పదవులు ఇచ్చేసి. నంద్యాల ప్రజల గురించి టీడీపీ ప్రభుత్వం మరిచిపోయిందని అక్కడి వారు బలంగా నమ్ముతున్నట్లు సమాచారం.

దాంతో పాటు ఉప ఎన్నికలు తప్పవని, వైసీపీ పోటీలోకి వస్తుందని తెలిసిన తర్వాత నంద్యాలలో ఉన్నపళంగా ప్రజల అవసరాలు ప్రభుత్వానికి కనిపించడం హుటాహుటినా ప్రజలు అడిగినవన్నీ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అయిపోవడం చేసిందని సమాచారం. అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ పనులన్నీ వైసీపీకి బాగా లాభాపడుతున్నాయని. కేవలం వైసీపీ పోటీ చేస్తున్నాం అని చెప్పడం వలెనే చంద్రబాబుకి నంద్యాల గుర్తుకొచ్చిందని అక్కడి ప్రజలు మాట్లాడుకున్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు, ప్రజల ఆలోచనలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ పోటీలో వైసీపీ అభ్యర్ధి గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రాధమిక సర్వేలు కూడా చెబుతున్నట్లు తెలుస్తుంది. అందుకే చంద్రబాబు ఎలా అయిన పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తూ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

Comments