ప్రచురణ తేదీ : Mon, Feb 5th, 2018

రెడ్ మి 5, 5ప్లస్ విడుదల తేదీ, ఫీచర్లు !

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమి, తన రెడీమి 5 , మరియు 5 ప్లస్ ఫోన్లను ఈనెల 14 న భారత్‌లో విడుదల చేయబోతొందని తెలుస్తోంది. అయితే దీని కోసం కంపెనీ బిగ్‌ 5 లోగోతో ఆహ్వానాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఈ లాంచింగ్‌ ఈవెంట్‌ గ్రాండ్ గా జరుగబోతుంది. ఈ ఈవెంట్‌లోనే రెడ్‌మి 5 ప్లస్‌ కూడా మార్కెట్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా. 2జీబీ ర్యామ్‌ / 16జీబీ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌ / 32 జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌ / 32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది.
చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత డిసెంబర్‌లోనే లాంచ్‌ చేశారు. బ్లాక్‌, గోల్డ్‌, లైట్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల వేరియంట్లలో అక్కడ మార్కెట్‌లోకి వచ్చింది. రెడ్‌మి 5తో పాటు రెడ్‌మి 5 ప్లస్‌ను కూడా చైనాలో లాంచ్‌ చేయడం జరిగింది. రెడ్‌మి 5 ధర అక్కడ 799 యువాన్ లు ఉందని అంటే మన కరెన్సీ ప్రకారం రూ.8100 గా ప్రారంభ ధర గా వుండనుందని, రెడ్‌మి 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 999 యువాన్ లు అంటే మన కరెన్సీ లో రూ.10,200 నుంచి ప్రారంభామ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ భారత్‌లో ఈ ఫోన్‌ ధర ఖచ్చితంగా ఇంతే ఉంటుందో లేక కొంత మేర హెచ్చు తగ్గులు వుంటాయో ఇంకా తెలియలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేమి 5 , 5 ప్లస్ ల ఫీచర్లు కింద విధంగా వుండనున్నాయి…

రెడ్‌మి 5 ఫీచర్లు:

రెడ్‌మి 5ప్లస్‌ ఫీచర్లు:

డ్యూయల్‌-సిమ్డ్యూయల్‌-సిమ్
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7 ఆధారితంగా ఎంఐయూఐ 9తో రన్‌ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7 ఆధారితంగా ఎంఐయూఐ 9తో రన్‌
రెడ్‌మి 5కి 5.7 అంగుళాల డిస్‌ప్లేరెడ్‌మి 5 ప్లస్‌కి 5.99 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీక్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌కి 2జీబీ/ 3జీబీ / 4జీబీ ర్యామ్‌రెడ్‌మి 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌కి 3జీబీ/ 4జీబీ ర్యామ్‌
16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌32జీబీ/ 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Comments