ప్రచురణ తేదీ : Nov 8, 2017 7:11 AM IST

గత జన్మలో నువ్వు భార్యవి.. అని మహిళను ట్రాప్ చేసిన బాబా

ప్రస్తుతం దొంగ బాబాల వివాదాలు చాలా ఎక్కువయ్యాయనే చెప్పాలి. ప్రజలు కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా చదువుకున్న తెలివిని కూడా పక్కనపెట్టి బాబాల లను నమ్ముతూ మోసపోతున్నారు. రీసెంట్ గా డేరా బాబా రేపిన సంచలనం గురించి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అదే తరహాలో ఒక సాధువు ఒక మహిళను నమ్మించి మోసం చేశాడు. గత జన్మలో మనమిద్దరం భార్య భర్తలమని చెప్పి ఆమెపై అత్యచారం చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ప్రమహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్‌ జెధియా అనే వ్యక్తి తనను ఆ దేవుడే పంపించాడని చెబుతూ.. గత కొంత కాలంగా అమాయక ప్రజలను మోసంచేస్తున్నాడు.

అంతే కాకుండా క్యాన్సర్ – ఎయిడ్స్ వంటి రోగాలను కూడా తగ్గిస్తానని చెబుతూ.. వారి దగ్గర డబ్బు గుంజేవాడు. అయితే ఈ మధ్య కాలంలో ఒక మహిళ తనకు కష్టాలున్నాయని ఏదైనా సలహా ఇవ్వండి అని అతని దగ్గరకు వెళ్లి అడిగింది. కానీ ఆ దొంగ సాధువు ఆమెపై కన్నేశాడు. రోజు ఆమెతో మాటలు కలుపుతూ.. ఒక రోజు మనం ఇద్దరం గత జన్మలో భార్య భర్తలం అంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు. అంతే కాకుండా కొన్ని పరిసర ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకెళ్లాడు. ఇటీవల అసోంకు తీసుకెళ్లినప్పుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పడంతో ఆ దొంగ సాధువు చరిత్రని మొత్తం బయటపెట్టారు. అయితే బాబాని విచారించగా అతను మాత్రం ఇది సత్యమని ఆమె గత జన్మలో నా భార్య అని వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రజలు కూడా ఇలాంటి వారిని నమ్మకూడదని తెలిపారు.

Comments