ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పెద్ద దిక్కు! కూలి గిట్టుబాటు కష్టం!


గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో బీజేపీతో కూటమిగా ఏర్పడి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎప్పుడు తనకు తానుగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి ఎన్టీఆర్ తర్వాత తెలుగు దేశం పార్టీ ఎప్పుడు కూడా సొంత ఆధిక్యత తెచ్చుకోలేదు అనేది కాలం చెబుతున్న మాట. మొదటి నుంచి బీజేపీ, కమ్యునిస్ట్, టీఆర్ఎస్ పార్టీల మద్దతు తో అధికారంలోకి వచ్చిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా వైసీపీ సొంత బలంతో గెలుపుకి దగ్గరవుతుంది అనుకున్న సమయంలో బీజేపీ, పవన్ కళ్యాణ్ మద్దతు సొంతం చేసుకోవడం ద్వారా స్వల్ప మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో, తరువాత కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎవరు మద్దతు లేకుండా సొంత గా నిరూపించుకుంది. స్పష్టమైన ఆధిక్యంతో గెలుపు సొంతం చేసుకుంది.

అయితే ఈ గెలుపు తమ అభివృద్ధికి ప్రజల నుంచి వచ్చిన మద్దతు అని భావిస్తున్న చంద్రబాబు దానిని మరింత పెంచుకునే ప్రయత్నం లో ఇంటింటా టీడీపీ అనే కొత్త పథకం మొదలుపెట్టాడు. దీనిని తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించిన చంద్రబాబు. తనకి ఈ సారి ప్రజలు 80 శాతం ఆధిక్యత ఇవ్వాలని కోరాడు. తాను నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నా అని చెప్పుకుంటూ, తాను మీ కోసం చేస్తున్న పని కూలిగా ఓట్లు ఇవ్వండి చాలు. వాటితో మీ కోసం మరింత దీక్షతో పనిచేస్తా అని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో మరో పార్టీ పోటీ లేకుండా కేవలం ప్రజలందరు తనకే మద్దతుగా నిలబడేట్లు చేయడమే తన లక్ష్యంగా బాబు చెబుతున్నాడు.

కాని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో జనసేన అనే మరో పార్టీ ప్రజల మధ్యకి చొచ్చుకెళ్ళిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి అధికారం ముఖ్యం కాకపోయినా ప్రజలు చాలా వరకు అతని వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు మూడు పార్టీలు సామాజిక వర్గాలుగా విభజించబడి ఉన్నాయి. ఇలాంటి బలమైన రెడ్డి సామాజిక వర్గం ఎప్పటికి టీడీపీ వైపు నిలబడదు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే మొదటి నుంచి టీడీపీకి బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఇప్పుడు జనసేన పార్టీతో అటు వైపు మళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి వేళ టీడీపీకి సింగిల్ డిజిట్ ఆధిక్యం అంటే అది అసలు సాధ్యం కాని మాట. కాకపోతే ప్రతిపక్ష పార్టీ అంటున్నట్లు ఈ సారి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేస్తే మాత్రం చంద్రబాబు మరల అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాని ఈ సారి జనసేన అధినేత ఎవరి వైపు నిలబడతాడు అనేది ఎన్నికలు పూర్తయ్యి తన ఆధిక్యత స్పష్టమయ్యే వరకు తెలియకపోవచ్చు. షో చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం మాత్రం ప్రజలే నిర్ణయిస్తారు. అనేది తెలుసుకుంటే మంచిది.

Comments