ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

నంద్యాలలో ప్రచారం చేయాలంటే పవన్ గారడీ చేయాలి.. పేరడీ చెప్పాలి! అవసరమా?

ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రధాన పార్టీలు రెండు ఎన్నికల ప్రచారంలో తమ సత్తా చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ వేడిని మరింత పెంచే ప్రయత్నం రెండు పార్టీలు చేస్తున్నాయి. అలాగే ఎవరికీ వారు ప్రజల ఓటు బ్యాంకు ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలోకి బాలకృష్ణని, అలాగే జనసేన అధినేత పవన్ ని రంగంలోకి దించడానికి ప్రయత్నింది. అయితే బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి ఎలాగూ వస్తాడు. అయితే ప్రచారంలో అతని ప్రభావం ఎంత అనేది ఇప్పటికే అధినేత చంద్రబాబుకి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే జనసేన అధినేత పవన్ ని టీడీపీ తరుపున ప్రచారంలో దించాలని వ్యూహం రచిస్తున్న దానికి పవన్ నుంచి ఎంత వరకు మద్దతు వస్తుంది అనేది తెలియాలి. గత ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ పార్టీకి పవన్ మద్దతు ఇచ్చిన అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు సొంతంగా బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ, మరో వైపు రాష్ట్రంలో పరిస్థితులు ఎ మాత్రం భాగోవడం లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీని గెలిపించామని ఎ లెక్కలో అడుగుతారు అనేది పెద్ద ప్రశ్న. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయ్యిందని ఇప్పటికే రాష్ట్రంలో టాక్ వినిపిస్తుంది. మరో వైపు సమస్యల మీద పోరాటం చేసే ప్రజలని అణచివేస్తూ, రిజర్వేషన్ ఉద్యమాన్ని పోలీస్ బలగాలంతో అడ్డుకుంటూ నియంతృత్వ పోకడలతో వెళ్తున్న టీడీపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తే ప్రస్తుతం ఉన్న ఆ కాస్తా పేరు కూడా పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. ఇలాంటి సందర్భంలో ప్రచారంలోకి వెళ్ళకుండా, సైలెంట్ గా ఉండటం బెటర్ అనే మాట కూడా వినిపిస్తుంది. లేదంటే. ప్రజల ఆత్మసాక్షిని నమ్మి ఓటుని వినియోగించుకోండి, మంచి, చెడులు బెరేజు వేసుకొని ఓటు వేయండి అనే మీడియా సమావేశం పెట్టి చేపాడం గాని చేయాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి పవన్ ఆలోచన ఏంటనేది చూడాలి.

Comments