ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

బాలయ్య ఎందుకు ఆగిపోయాడు.. పవన్ కళ్యాణ్ కోసమా..?

ఓ వైపు వైసిపి అధినేత జగన్ నంద్యాల ప్రచారం లో దూసుకుపోతున్నారు. చంద్రబాబు పై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు దారుణమని, వివాదంగా ఉన్నాయని టిడిపి గగ్గోలు పెడుతున్నా జగన్ మాత్రం దూకుడు తగ్గించడం లేదు. దీనితో జగన్ కి దీటుగా టీడీపీ ప్రచారం మోతక్కాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ రావలసిందే అనే వాదనని టీడీపీ వర్గాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ నంద్యాల ఉపఎన్నిక గురించి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలో జనసేన పార్టీ నిర్ణయాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని సైలెంట్ గా ఉండిపోయారు. అప్పటినుంచి పవన్ నిర్ణయం కోసం టిడిపి నే కాదు అని రాజకీయ వర్గాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

తెలుగు దేశంపార్టీ లో మరో వర్గం బాలయ్యని ప్రచారంలోకి దించాలని పట్టు బడుతున్నారు. ఈ లోపాలు పవన్ తన నిర్ణయాన్ని టీడీపీ కి అనుకూలంగా ప్రకటిస్తే ఒకేసారి ఇద్దరు స్టార్లచే ప్రచారం నిర్వహించడం ఇబ్బందిగా మారె అవకాశం ఉందని టీడీపీ వర్గాలు బాలయ్యని రంగం లోకి దించలేదు. పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని బయట పెట్టేటట్లు కనిపించడం లేదు. జగన్ కన్నా టీడీపీ ప్రచారంలో వెనుక బడిన నేపథ్యం లో బాలయ్యని ఇప్పటికైనా ప్రచారానికి ఆహ్వానించని టీడీపీ నేతలు అంటున్నారు. 2014 ఎన్నికలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన భూమా నాగిరెడ్డి నంధ్యాలనుంచి గెలుపొందారు. టీడీపీ తరుపున పోటీ చేసిన శిల్పా దాదాపు 3000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇప్పుడు శిల్పా వైసిపి తరుపున బరిలో దిగడం, భూమా వర్గం టీడీపీ నుంచి పోటీ చేయనుండడంతో నంద్యాల స్థానం ఎవరి వశం కానుందో అనే ఉంత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

Comments