ప్రచురణ తేదీ : Jan 28, 2017 9:18 AM IST

ప్రత్యేక హోదా కావాలంటున్న వారికి బుద్ది లేదంటున్న స్టార్ ప్రొడ్యూసర్

ashvini-dutt
ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ మద్దతు పలికాయి. అంతేకాకుండా సినీ నటులు కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ విషయంపై అందరికంటే ముందు నుండి పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారు. తెలంగాణ హీరో అయిన సంపూర్ణేష్ బాబు కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ తెలుగులో భారీ చిత్రాలు నిర్మించిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగే వాళ్లకు బుద్ది లేదని వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాత అశ్వినీదత్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించగా ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆందోళన చేసే వారికి బుద్ది లేదని’ ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే రాష్ట్రము గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచించరని, కలిసి ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ నాశనం చేసిందని, కష్టాలలో ఉన్న రాష్ట్రము యొక్క భాద్యతలను చంద్రబాబు తన భుజాలపై వేసుకుని కష్టపడుతున్నారని అశ్వినీదత్ చెప్పారు. చంద్రబాబు ను అధికారం నుండి దింపేయాలని కొందరు చూస్తున్నారని, ఆయన దిగిపోతే మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు. ఇంకాకొంత దోచుకుంటారు. ఇలాంటి బుద్ధిలేని వారి వెనుక ఎవరూ ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Comments