ఉన్నతాధికారుల తీరును విమర్శించిన సైనికుడు కనిపించడం లేదు….?

sainik
భారత సైన్యంలో పని చేస్తున్న తమకు సరైన ఆహరం కూడా అందించడం లేదని ఒక వీడియో చేసి ఫేస్ బుక్ లో తేజ్ బహుదూర్ యాదవ్ అనే ఒక జవాను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే అతని ఆరోపణలను ఉన్నతాధికారులు తిరస్కరించారు. అతని 20 ఏళ్ల సర్వీసులో 4 బ్యాడ్ ఎంట్రీలు ఉన్నాయని, అందుకే అతనికి పదోన్నతి లభించలేదని, దానితో అతను మానసిక ఒత్తిడికి గురై ఇలా మాట్లాడి ఉంటాడని వారు అంటున్నారు. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదేమోనని వారు సందేహం వెలిబుచ్చారు.

ఈ ఉదంతంతో ఇప్పుడు తేజ్ బహుదూర్ భార్య బయటకొచ్చింది. తన భర్త చెప్పింది అక్షరాలా నిజమని, ఆయన చేసిన పని సబబేనని ఆమె అన్నారు. తన భర్తకు మానసిక స్థితి బాగానే ఉందని, బాగోకపోతే సరిహద్దులో డ్యూటీ ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించింది. మంచి భోజనం పెట్టమనడం తప్పు కాదు కదా అని బహుదూర్ కుమారుడు రోహిత్ ప్రశ్నించాడు. దీనిపై విచారణ జరపాలని, తమకు న్యాయం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. సోమవారం సాయంత్రం నుండి తేజ్ బహుదూర్ కనిపించడం లేదని, ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించినా ఉపయోగం లేదని, ఆయన ఎక్కడ ఉన్నారో అని ఆందోళనగా ఉందని వారు తమ ఆవేదన వెలిబుచ్చారు.

Comments