ఆస్తికోసం కన్న బిడ్డను ఆ తల్లి ఏమి చేసిందంటే


ప్రస్తుతం మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో అక్కడక్కడా జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఉదయ్ పూర్ లో జరిగిన ఓ హత్య కేసును విచారించిన పోలీసులు, నమ్మశక్యం కాని నిజాలను వెలుగులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలోని చోటీ సద్రి ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. వారు తెలిపిన సమాచారం మేరకు మృతుడు మోహిత్ (21) మానసిక స్థితి సరిగ్గా లేదని, మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. తండ్రి చనిపోయిన తరువాత మోహిత్ ఆగడాలు పెచ్చుమీరాయి.

తల్లిని వేధిస్తూ ఉండేవాడు. తనకున్న నాలుగు బీగాల భూమిని అమ్మాలని ఆమె భావించగా, సంతకం పెట్టేందుకు మోహిత్ అంగీకరించలేదు. దీంతో తల్లి ప్రేమలతా సుతార్, మోహిత్ తరచూ వెళ్లే దాబా యజమానితో డీల్ కుదుర్చుకుంది. ఆపై బావమరిది కిషన్ సుతార్, మహాదేవ్ ధకడ్, గణపత్ సింగ్ లతో కలసి ప్లాన్ చేసి అతన్ని చంపించింది.

దాబా యజమాని గణపత్ సింగ్ కు తొలుత రూ. 50 వేలు అడ్వాన్సుగా చెల్లించిందని, దాబాకు మోహిత్ వెళ్లిన సమయంలో, ఆర్డర్ చేసిన ఫుడ్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి, ఆపై హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు ఛేదనలో సమీపంలోని టోల్ గేటు సీసీటీవీ ఫుటేజ్ తమకు కీలక ఆధారాలను ఇచ్చిందని తెలిపారు. అయితే నిందితులందరినీ అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగిన ఈ సంఘటనతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా వులిక్కిపడ్డారు….

Comments