అమిత్‌షాతో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు భేటీకి కారణం ఏంటీ..?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ రోజు కొన్ని కీలక విషయాలు చర్చించడానికి భేటీ అయ్యారు. అయితే వీరిద్దరినీ కలవడానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు కుడా వీళ్ళని కలిశాడు. రాష్ట్ర విభజన హామీల విషయమై వీరిద్దరిమధ్య ఒక గంటన్నరపాటు చర్చ జరిగినట్టు తెలిసింది. డేడ్ లైన్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో విభజన హామీల చర్చలపై ఏపీ ప్రభుత్వం కీలక భేటీ ఏర్పరచుకుంది. అయితే ఈ భేటీకి రాజకీయాలకు సంభందించిన కారణాలు ఏమీ ల;ఎకపోయినా కుడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన వాదోపవాదాలను రూపుమాపాపడానికే ఈ వ్యవహారం అంతా సాగుతున్నట్టు విశ్లేషక వర్గాల సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అనుకున్నవి అనుకున్నట్లు నెరవేర్చకపోవడం, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తిస్కోకపోవడం, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నట్లు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం అగ్గి రాజేసింది. ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు మొన్న జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తీవ్ర నిరసనలు ఆందోళనా గళాలు వ్యక్తపరచారు. ఈ నేపథ్యంలో మార్చి 5లోపు ఓ కచ్చితమైన ప్రకటన చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని, తరువాత విడుత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతున్న కారణంగా ఈ భేటీ ఆసక్తికరమైన విషయంగా మారింది.

విశాఖలపట్నంలో రైల్వేజోన్‌, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి ఏర్పాటు, రాష్ట్రానికి సమర్పించాల్సిన నిధుల విషయంలో స్పష్టమైన విశ్లేషణ వచ్చేవరకు తాము శాంతించేది లేదని టీడీపీ స్పష్టంచేసిన నేపథ్యంలో ఈ రోజు జరిగిన భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పెద్దమనిషి తరహాలో నేతృత్వం వహిస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కార్యాలయంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం అందింది. ఈ భేటీలో చర్చనియామ్శంగా మారిన ముఖ్యమైన విషయాలు రెవెన్యూ లోటు, రైల్వేజోన్‌, కడపలో ఉక్కు కర్మాగారం, ప్రత్యేక ప్యాకేజీ నిధులు.. ఈ నాలుగు అంశాలే ఈ భేటీలో ప్రధానంగా చర్చకు దారి తీసి భేటికి కారణం అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో చర్చించిన అంశాలనే తిరిగి వీరిద్దరూ సీఎం చంద్రబాబుకు వివరించే ఆస్కారం ఉన్నట్టు సమాచారం అందింది. ఆయనకు వివరించాకే తదుపరి నిర్ణయం వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఇలాగుంటే మరోవైపు, ఆర్థికశాఖలో జరుగుతున్న చర్చలు కూడా అరుణ్‌జైట్లీ ద్వారా తెలుసుకొని అమిత్‌షా వీరికి వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Comments