ప్రచురణ తేదీ : Thu, Aug 10th, 2017

నేను కేటీఆర్ బావమరిది ని .. చెప్పింది చెయ్యాల్సిందే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు సంబంధించి ఇప్పటివరకూ రాని సరికొత్త ఆరోపణ బయటకు వచ్చింది. ఆయన పేరును వాడేసుకుంటున్న ఒక ప్రబుద్ధుడు కేటీఆర్ బావమరిదినంటూ బెదిరింపుల పర్వానికి దిగుతున్న వైనం వెల్లడైంది. తాను మంత్రి కేటీఆర్ బావమరిదినంటూ వేధిస్తున్నట్లుగా రాయదుర్గంలోని ఎటర్నల్ క్వెస్ట్ ఐటీ సర్వీసెస్ సంస్థ పార్టనర్స్ సాయి చరణ్.. అభిషేక్ లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. తమ కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంతో పాటు.. డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నట్లుగా వారు ఆరోపించారు.

కేటీఆర్ బావమరిదిగా చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి తమకు రక్షణ కల్పించాల్సిందిగా వారు కోరారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కమిషన్ అక్టోబరు 4 లోపు ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ మాదాపూర్ ఏసీపీకి నోటీసులు జారీ చేశారు.

Comments