అలా చేస్తే 50 వేల తెలుగు ఓట్లు విశాల్ ‘రెడ్డి’వే..?

ఆర్కే నగర్ బైపోల్ గురించి హీరో విశాల్ ఎంత లోతుగా ఆలోచించాడో తెలియదు కానీ ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ ని మాత్రం సిద్ధం చేసుకుంటున్నాడు. రాజకీయాల పిచ్చితో నటుడిగా తన కెరీర్ ని పాడు చేసుకుంటున్నాడనే ఆరోపణలు ఇప్పటికే ఎదురవుతున్నాయి. అయినా విశాల్ వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే నామినేషన్ తంతు కూడా ముగిసింది. సినీ హీరో అమ్మ స్థానంలో పోటీ చేస్తున్నదంటూ మీడియాలో కావలసినంత ప్రచారం లభించింది. కేవలం మీడియా పబ్లిసిటీ ద్వారా ఓట్లు కొల్లగొట్టడం కష్టం. అందుకే ఫక్తు రాజకీయ నాయకుడిగా విశాల్ ఆలోచనలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఆర్కేనగర్ లో 50 వేలకు పైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. అందులో అగ్రభాగం రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారే కావడం విశేషం. దీనితో ఈ యంగ్ హీరో తన విశాల్ ‘రెడ్డి’ ట్యాగ్ ని ఉపయోగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్కే నగర్ లో విశాల్ రెడ్డి పేరుతో భారీగా ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. తాను తెలుగు వ్యక్తిననే సెంటిమెంట్ ని, రెడ్డి ట్యాగ్ ని సరైన విధంగా అప్లై చేస్తే ఆర్కేనగర్ లోని 50 వేల తెలుగు ఓట్లు ఈ హీరో ఖాతాలో పడ్డట్లే అని విశ్లేషకులు అంటున్నారు. అదే విధంగా ఆర్కేనగర్ లో ఉన్న వైఎస్ఆర్, జగన్ ల అభిమానుల మద్దత్తు కోసం వారి పేర్లని సైతం ప్రస్తావిచడానికి రెడీ అవుతున్నాడట. ప్రాంతీయ వాదం అంటే పడి చచ్చే తమిళనాడులో మనవాడు ప్రాంతీయ అభిమానం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని స్కెచ్ వేసాడు.

Comments