ప్రచురణ తేదీ : Mon, Sep 11th, 2017

విరాట్ ఆ ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ కు ఏం ఇచ్చాడో తెలుసా


ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఎంతో పాపులర్ అవుతోంది. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళూ కూడా క్రికెట్ ను అమితంగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ మధ్య మహళల క్రికెట్ జట్లు కూడా మంచి ప్రతిభను కనబరుస్తూ మంచి గుర్తింపును అందుకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా ,ఇండియా , ఇంగ్లాండ్ జట్లలోని మహిళలు అగ్రస్థానంలో ఉండి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదు చేస్తున్నారు. అయితే వారు ఎక్కువగా మేన్స్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు. ముఖ్యంగా విరాట్ ధోని వంటి ఆటగాళ్లను విదేశీ మహిళా క్రికెటర్స్ కూడా చాలా ఇష్టపడతారు. అందులో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్‌ కూడా ఉన్నారు.

ఆమె విరాట్ ప్రతి ఆటను ఎంతో ఆదర్శంగా తీసుకుంటుందట. అప్పట్లో ఈ మహిళ సోషల్ మీడియా ద్వారా విరాట్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని పెళ్లి ప్రపోజల్ కూడా చేసింది. అయితే ఆమె కేవలం విరాట్ మీద అభిమానంతోనే అలా కామెంట్ చేసింది. అయితే విరాట్ 2014 లో ఇంగ్లాండ్ పర్యటన చేసినప్పుడు అక్కడ డానియెల్లి విరాట్ ని కలుసుకోగా ఆమెకు విరాట్ తన బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే ఆ బ్యాట్ ఫోటోను దానియెల్లీ రీసెంట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి త్వరలోనే విరాట్ ఇచ్చిన బ్యాట్ తో ప్రాక్టీస్ చేస్తానని చెప్పింది. ఇన్ని రోజులు దీన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకున్న ఆమె ఇప్పుడు విరాట్ బ్యాట్ తో ఆడటానికి సిద్ధమైంది. త్వరలో ఆస్ట్రేలియా తో జరిగే యాషెస్ సిరీస్ కు ఆమె సిద్ధమవుతోంది.

Comments