ప్రచురణ తేదీ : May 24, 2018 3:10 PM IST

అభిమానులు మమ్మల్ని క్షమించాలి : విరాట్ కోహ్లీ

2018 ఐపీఎల్ మొదటి నుంచి ఎంతో రసవత్తరంగా సాగింది. ఆటగాళ్లు అసలైన టాలెంట్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే భారత అభిమానులు ఎక్కువగా ఇష్టపడే కోహ్లీ సేన మాత్రం ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. భారత కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందుకున్న కోహ్లీ ఐపీఎల్ లో మాత్రం బెంగుళూరు జట్టును కనీసం ప్లే ఆఫ్ దశకు కూడా చేర్చలేకపోయాడు. మేటి ఆటగాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ ఎవ్వరు సరైన సమయంలో జట్టును ఆదుకోకపోవడంతో ఇంటిబాట పట్టాల్సివచ్చింది.

ఆడిన 14 లీగ్ మ్యాచ్ లో కేవలం 6 మ్యాచ్ లలో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. అయితే ఐపీఎల్ ప్రదర్శనపై కోహ్లీ రీసెంట్ గా అభిమానులకు క్షమాపణ చెప్పాడు. మాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న అభిమానులను నిరుత్సహపరిచినందుకు క్షమించమని వేడుకుంటున్నా. మేము పూర్తిస్థాయిలో మంచి ప్రదర్శనను ఇవ్వలేకపోయా. ఈ ఐపీఎల్ గర్వించే సీజన్ కాదు. ఈ ఓటమి ఒక గుణపాఠం. అభిమానులు తమపై పెట్టుకున్న నమ్మకానికి మేము న్యాయం చేయలేకపోయాము. వచ్చే సీజన్ లో మరింత పట్టుదలతో వారిని అలరించడానికి కృషి చేస్తామని రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించారు.

Comments