ప్రచురణ తేదీ : Dec 7, 2017 8:11 AM IST

కోహ్లీ డుమ్మా కొట్టేది అందుకే..అనుష్కతో ఇటలీలో పెళ్లి..?

కోహ్లీ – అనుష్క..ఇండియాలోనే హాట్ సెలెబ్రిటీ జంట వీరు. క్రికెట్లో విరాట్ ఎంతగా మునిగితేలుతున్నాడో అనుష్కతో ప్రేమ వ్యవహారం కూడా అంతే. కోహ్లీ, అనుష్క ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే అయినా మీడియాలో కొత్త కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ టీం ఇండియా కెప్టెన్ శ్రీలంక తో జరిగే వన్డే, టి20 సిరీస్ కు సెలవు పెట్టేశాడు. బీసీసీఐ ఓ వైపు కోహ్లీ విశ్రాంతి కల్పించామని చెబుతున్నా మీడియాలో మాత్రం వేరేవిధంగా వార్తలు వస్తున్నాయి. అనుష్క – కోహ్లీల వివాహం ఈ నెల 12న ఇటలీలో జరగబోతోందనేది ఆ వార్తల సారాంశం. అనుష్క మేనేజర్ రంగంలోకి దిగి ఖండించే వరకు కూడా ఈపుకార్లు ఆగలేదు.

త్వరలోనే ఈ జంట ఇటలీ బయలుదేరి వెళుతోందని అక్కడ వివాహం చేసుకుని తిరిగి వస్తారని ప్రచారం జరుగుతోంది. కోహ్లీ లాంగ్ లీవ్ పెట్టడానికి బలమైన కారణం ఇదే అని అంటున్నారు. ఇప్పటికే ఇరుకుటుంబ సభ్యులకు ఇటలీ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ అయ్యాయట. అలాంటిదేమి లేదంటూ అనుష్క మేనేజర్ ఈ వార్తలని ఖండించారు. కోహ్లీ, అనుష్కపై ఇలాంటి వ్యాఖ్యలు కొత్త కాదు.

Comments