ప్రచురణ తేదీ : Dec 8, 2017 2:44 AM IST

చీటింగ్ కేసులో రాములమ్మ ఇక రిలాక్స్ !

నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి బిగ్ రిలీఫ్. ఆమె మెడకు చిక్కుకున్న ఓ చీటింగ్ కేసు నుంచి ఉపశమనం లభించింది. మద్రాసు హైకోర్టు విజయశాంతిపై ఫైల్ అయిన పిటిషన్ ని కొట్టివేసింది. ఓ హోటల్ అధినేత ఇందర్ చాంద్ జైన్ విజయశాంతిపై స్థలానికి సంబందించిన వివాదంలో కేసు ఫైల్ చేసారు. టి నగర్ లోని తన స్థలాన్ని విజయశాంతి ఇందర్ చాంద్ జైన్ కు విక్రయించారు. ఆమేరకు ఆమె అతడి నుంచి రూ.4.68 కోట్లు తీసుకున్నారని, కానీ విజయశాంతి ఆ స్థలాన్ని తనకు అమ్మకుండా ఇతరులకు అమ్మారనేది అతడి అభియోగం.

ఈ కేసు ఐదేళ్ల క్రితమే నమోదైంది. ఈ కేసు పలు కోర్టులను మారుతూ చివరకు మద్రాసు హై కోర్టుకు చేరుకుంది. దీనిపై విజయ శాంతి కూడా కౌంటర్ దాఖలు చేసారు. తనపై వ్యక్తిగత కక్షతోనే ఇలా కేసులతో ఇబ్బంది పెడుతున్నారనేది రాములమ్మ వాదన. రెండు వాదనలని విన్న న్యాయస్థానం విజయశాంతికి అనుకూలంగా తీర్పు ప్రకటించింది. ఆమెపై ఉన్న కేసుని కొట్టివేసింది.

Comments