పవన్ ని వాళ్లకు దక్కకుండా చేసింది చంద్రబాబే !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం కొనసాగుతోంది. 2019 ఎన్నికల వరకు ఇది ఉంటుందా ఉండదా అనేదే ఇక్కడ ప్రశ్న. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ ఆయన్ని కలిసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో బడా రాజకీయ నాయకులంతా పవన్ పై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

టి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పవన్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చరిష్మా ని ఉపయోగించుకోవడానికి ఎవరికి వారు ఎత్తులు వేస్తున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో బిజెపి కేవలం పవన్ కళ్యాణ్ తో మాత్రమే కలసి పోటీ చేయాలని భావించారు. నరేంద్ర మోడీ పవన్ గురించి తెలుసుకుని చంద్రబాబు కంటే ముందుగా పవన్ తో భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. జనసేన – బిజెపి మధ్య పొత్తు చిగురిస్తున్న తరుణంలో బాబు నేరుగా పవన్ ఇంటికి వెళ్లి మరీ మాయ చేసి తనవైపుకు తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. బాబు చాలా ఇంటెలిజెంట్ అని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ ని వదులుకునే ఉద్దేశం చంద్రబాబుకు ఇప్పటికి లేదని అన్నారు. కాపుల ఓటు బ్యాంకు దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కూడా పవన్ తో స్నేహం మొదలు పెట్టారని వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా వీహెచ్ పవన్ గురించి పై విధంగా అన్నారు.

Comments