భార్య భర్తల మధ్య శృంగారం..ఆ దేశంలో భయపడి చస్తున్నారు..!

భార్య భర్తల మధ్య రొమాన్స్ అనేది దాంపత్య జీవితంలో సర్వసాధారణం. సంతానం పొందాలంటే అది అవసరం కూడా. కానీ వెనుజుల దేశంలో భార్య భర్తలంతా పడకింటిలోకి వెళ్లాలంటేనే భయపడి చస్తున్నారు. శృంగార కోరికలతో పొరపాటున రొమాన్స్ చేసినా దీని ఫలితం ఎలా అనుభవించాలలో అని భయానికి గురువుతున్నారు. భార్య భర్తలు రోమన్స్ చేస్తే తప్పులేదు. పైగా పండండి పిల్లడో పాపో పుడుతుంది. దీనికి కంగారు ఏంటనే సందేహం రావొచ్చు. వెనుజుల ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది.

నా భార్య గర్భం దాల్చింది..మేమిద్దరం మూడుపూటలా తినడానికే కష్టపడుతున్నాం.. పుట్టబోయే బిడ్డని ఎలా పోషించాలి..ఇది ఒక భర్త ఆవేదన. గర్భం దాల్చకుండా ఉండాలంటే ఇంట్లో చేసుకునే చిట్కాలు ఇవి.. రెండు పూటలా బొప్పాయి జ్యూస్, అల్లం టీ ని సేవించండి..ఇది ఓ పత్రికలోని కథనం. ఈ రెండు స్టేట్మెంట్ లని బట్టి వెనుజుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువులని పక్కన పెడితే కనీసం కండోమ్ కొనుక్కునే స్థితిలో కూడా ఆదేశపు ప్రజలు లేరు. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో కొన్నిషాప్ లలో కండోమ్ లని, గర్భ నిరోధక మాత్రలని అమ్మడమే మానేశారు. ఓ రొట్టె ముక్క కొనుక్కుని ఆకలి తీర్చుకుందాం అని ప్రయత్నించినా గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది.

అందుకే భార్య భర్తలు పడకగది వైపు చూడాలంటేనే భయపడి చస్తున్నారు. ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా లోతుగా ఆలోచిస్తే వెనుజుల దుస్థితికి జాలివేయక మానదు. 21 గర్భ నిరోధక మాత్రలు ఉన్న పాకెట్ కొనాలంటే 1.20 లక్షల వెనుజుల బోవియర్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఓ వెనుజుల ఉద్యోగి జీతంలో మూడో వంతు. ఇక కండోమ్స్ కొనాలన్నా కొన్ని రోజుల జీతాన్ని వదులుకోవాల్సిందే.

Comments