ప్రచురణ తేదీ : Mon, Nov 28th, 2016

పవన్ మాట వింటే ఆత్మ లేచి గంతులేస్తుందట..!

pk
క్యూబా దేశ విప్లవకారుడు ఆ దేశ ప్రధాని అయిన ఫిడెల్ క్యాస్ట్రో శనివారం మరణించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యం లో ప్రపంచవ్యాప్తం గా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా క్యాస్ట్రో మరణం పై తన సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచం ఓ ఆదర్శవంతమైన లీడర్ ని కోల్పోయిందని పవన్ అన్నారు. తాను అమితంగా ఇష్టపడే చే గువేరా తో కలసి క్యాస్ట్రో ప్రయాణం చేసారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని పవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

ప్రతి సారి ఎదో ఒక వివాదం లో తలదూర్చి వారిపై ట్విట్టర్ లో స్పందిచే రామ్ గోపాల్ వర్మ ఈ సారి కూడా పవన్ వ్యాఖ్యల కేంద్రంగా స్పందించారు. పవన్ చేసిన వ్యాఖ్యలను వింటే చేగువేరా ఆత్మకూడా లేచి గంతులేస్తుంది అని రాంగోపాల్ వర్మ అన్నారు. కానీ తాను చేగువేరా కంటే పవన్ కళ్యాణ్ నే ఎక్కువగా అభిమానిస్తానని వర్మ చెప్పుకొచ్చాడు.

Comments