ప్రచురణ తేదీ : Jan 11, 2018 1:12 PM IST

విద్యుత్ సరఫరా టవర్ల విషయంలో టి ఆర్ ఎస్ పై వి హెచ్ ఫైర్

ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంత రావు తెలంగాణ రాష్ట్రాన్ని కె సి ఆర్ అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, ఎప్పుడూ బంగారు తెలంగాణ అనే మాటలు చెప్పే కె సి ఆర్ ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన అన్నారు. రైతుల భూముల్లో విద్యుత్ సరఫరా టవర్లను ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ ఆయా స్థలాలను ఇచ్చిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేందుకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తూ నిరాకరిస్తోందని ఈ విషమై ఆయన కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్ కె సింగ్ కు బుధవారం ఒక లేఖ రాశారు. కేంద్రం వారు విధించిన మార్గదర్శనాల మేరకు రహదారులకు సమీపంలో వున్న భూముల్లో నిర్మించిన టవర్ల 4.5 లక్షలు, అదే దూరంగా వున్న భూముల్లో నిర్మించిన టవర్ల అయితే 3.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. విద్యుత్ టవర్ల మధ్య స్థలానికి, అలాగే పంట నష్టానికి 35 సంవత్సరాలపాటు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు రైతులకు ఆ నష్టపరిహారం వీలైనంత త్వరగా అందించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన లేఖ ద్వారా మంత్రికి విజ్ఞప్తి చేశారు…

Comments