హెచ్‌–1బీ వీసాపై ట్రంప్ కొత్త నిర్ణయం.. అమలైతే భారతీయులకు కష్టమే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సరికొత్త ఆలోచనలతో ఓ వైపు అక్కడి దేశీయులను ఆకట్టుకుంటూనే మరోవైపు విదేశీయులకు భయాన్ని కలిగిస్తున్నాడు. అధ్యక్ష పదవికి ముందు ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పిన కఠిన నిర్ణయాలను మరచిపోకుండా అమలు పరుస్తున్నాడు. దీంతో ప్రస్తుతం అక్కడ విదేశీయులు ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ గా హెచ్ -1బీ వీసా విధానంలో ట్రంప్ కొత్త తరహా సవరణని ప్రతిపాదిస్తున్నాడు. అమెరికా వస్తువులనే కొనండి అంటూ.. అమెరికా ప్రజలకే ఉద్యోగాలను ఇవ్వాలన్న ట్రాంప్ నినాదానికి అక్కడి ప్రభుత్వం హెచ్ -1బీ వీసా విధానంలో ఎవరు ఊహించని విధంగా మార్పులు చేయబోతోంది.

ప్రస్తుతం వీసా తీసుకొని అమెరికాలో ఉద్యాగాలు చేస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. అయితే అక్కడే స్థిరపడాలని గ్రీన్ కార్డ్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొన్నటి వరకు గ్రీన్ కార్డు అప్లికేషన్ పరిశీలనలో ఉంటే వీసా గడువును పొడిగించుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇక నుండి అలా ఉండదని ఆ దేశ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం హెచ్‌–1బీ వీసాల విధానంలో మార్పులు చేయనుంది. వీసా గడువు ముగిస్తే విదేశీయులు ఎవరైనా సరే వెంటనే అమెరికాను వదిలి వెళ్ళిపోవాలి అనే కొత్త రూల్ ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సరికొత్త నిర్ణయం అమలైతే అక్కడ ఉన్న ఎంతో మంది భారతీయులు వెనక్కి రావాల్సి ఉంటుంది. భారతీయ కంపెనీలు చాలా వరకు అక్కడ వారి కార్యకలాపాల కోసం ఇండియా నుంచి ఉద్యోగుల్ని హెచ్‌–1బీ వీసాల ద్వారా పంపిస్తోంది. అయితే ఇప్పుడు హెచ్‌–1బీ వీసాలో కొత్త సవరణ అమలైతే దాదాపు 5 లక్షల నుండి ఏడున్నర లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Comments