ప్రచురణ తేదీ : Sep 24, 2016 11:46 AM IST

అంత ఆశ ఉందా.. పవన్ కు ఉండవల్లి సలహా ఏమిటో తెలుసా..?

pavan-new-jana
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధ్యక్షుడు జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రానికి మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.ప్రత్యేక హోదా కోసం ఎవరు ఎన్ని సంవత్సరాలు పోరాడినా వృధా అని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి పై పోటీ చేయాలని కోరారు.దీనికోసం పవన్ కళ్యాణ్ వైసిపి అధినేత జగన్, కమ్యూనిస్టులను కలుపుకోవాలని అన్నారు.

పవన్, జగన్ కమ్యూనిస్టులు అంతా కలసి టిడిపి-బిజెపి ల పై పోటీ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు.ఉండవల్లి ప్రతిపాదనకు భిన్నంగా రాజకీయ విశ్లేషకుల విశ్లేషణలు ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ జగన్ తో కలవడం అనేది సాధ్యపడే అంశమేనా అనేది విశ్లేషకుల వాదన.కానీ కమ్యూనిస్టుల తో పవన్ కలవడం మాత్రం ఇప్పట్లో సాధ్యపడక పోయినా భవిష్యత్తులో సాధ్యపడే అంశమే అని అంటున్నారు. ఎందుకంటే పవన్ కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తే . కానీ పవన్ కళ్యాణ్, జగన్ లు కలవాలనుకోవడం మాత్రం ఉండవల్లి అత్యాశే అని అంటున్నారు.

Comments