ఎన్నారై ను మోసం చేసిన సీరియల్ నటి..రూ.40లక్షలు స్వాహా

ఈ మధ్య కాలంలో కొంత మంది అమ్మాయిలు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంచి వారీగా ప్రవర్తిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బున్న అబ్బాయిలకు అందాలను ఎరగా వేసి ముగ్గులోకి దింపి నిండా ముంచేస్తున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ నటి ఒక ఎన్నారై ను మోసం చేసి దాదాపు రూ.41 లక్షలను కాజేసింది. అసలు వివరాల్లోకి వెళితే.. సేలంకు చెందిన జి. బాలమురుగన్‌ అనే యువకుడు జర్మనీలోని ఓ ఆటోమొబైల్‌ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.

అయితే కొన్ని నెలలక్రితం అతని ప్రొఫైల్ ను మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ వెబ్ సైట్ ద్వారానే మైథిలీ వెంకటేష్ అతనికి పరిచయం అయ్యింది. పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెబుతూ ఆమెకు సంబందించిన కుటుంబంలోని అన్నయ్య అమ్మ నాన్న పోటోలను పంపించింది. అది చూసి బలమురుగుగాన్ ఆమెను నమ్మడు. కొన్ని రోజుల తరువాత మైథిలి తనకు బ్రెయిన్ ట్యూమర్ అని తల్లికి గెండెకు శాస్త్ర చిక్కిత్స చేయాలనీ డబ్బును అడిగింది.దీంతో అతను రూ.41 లక్షలను ఆమె ఎకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయగా ఆ తరువాత అతని కుంటుంబ సభ్యుల ద్వారా అతనికి అసలు నిజం తెలిసింది. ఆమె అసలు పేరు మైథిలి కాదని శృతి అని తెలుసుకున్నాడు. అంతే కాకుండా ఆమెకు తండ్రిగా ఒక వ్యక్తి నటించాడు. బాధితుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు.

Comments