తెలంగాణ ఆర్టీసీ బంపర్ అఫర్.. చిల్లర లొల్లికి చెక్!

గత కొంత కాలంగా ఆర్టీసీ బస్సుల చార్జీలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికులకు సంక్రాంతి కానుకగా మంచి అఫర్ ని అందించింది. చాలా కాలం తరువాత చార్జీలను తగ్గించింది. ఇక నుంచి రౌండ్ ఫిగర్ ఉండేలా చార్జీలను ఫిక్స్ చేశారు. ఎక్కువగా చిల్లర సమస్యతో ఇన్ని రోజులు ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. కండక్టర్లు కూడా చిల్లర లేక సతమతమయ్యేవారు. బస్సుల్లో ఒక్కోసారి వివాదాలు కూడా అయ్యేవి.

ఇక నుంచి అలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లు రూ.5, రూ.10, రూ.15, రూ.20 ఇలా ఉంటాయి. కనీసధరను 5 రూపాయలకు నిర్ణయించారు. మొదట హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సంక్రాంతి నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. రూ.5, రూ.10, రూ.15, రూ.20, రూ.25, రూ.30 చార్జీలు మాత్రమే ఇక నుంచి కనిపిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చార్జీలు సామాన్యులకు చాలా ఉపయోగపడనున్నాయి.

Comments