అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆ పదానికి స్పెల్లింగ్ కూడా తెలీదంట…!

Donald-Trump-says-Brexit-a-
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ప్రజల దృష్టిలో పలుచన అయ్యారు. కొన్ని రోజుల క్రితం తన కూతురు గురించి టీవిలో వస్తున్న ఒక ప్రోగ్రాం చూసి తన ట్విట్టర్ ద్వారా ఇవాంకాను లింక్ చేస్తూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. కానీ ఆయన లింక్ చేసింది కూతురు అకౌంట్ కాదు. కూతురు అనుకుని వేరొక మహిళకు లింక్ చేసాడు. అమెరికాకు అధ్యక్షుడు అయి ఉండి ఇలాంటి తప్పిదం చేయకూడదని అందరూ ట్రంప్ ను విమర్శించారు. మరొకసారి ట్రంప్ ఇలాంటి తప్పే చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో చేసే వ్యాఖ్యలు ఆయనకు చాలా చికాకు తెప్పిస్తున్నాయి. ఆనర్, ఆనర్డ్ అనే పదాలతో ట్రంప్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. 2016 ఫిబ్రవరిలో ‘ఆనర్’ (గౌరవం) అనే పదాన్ని honer అని తప్పుగా రాసిన ట్రంప్ ఇప్పుడు ‘ఆనర్డ్’ అనే పదం అక్షర క్రమాన్ని తప్పుగా రాశారు. అధ్యక్ష భాద్యతలు చేపట్టిన తరువాత పెట్టిన ఒక ట్వీట్లో honored/honoured పదాన్ని తప్పుగా రాశారు. అమెరికన్ ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ honored కాగా, బ్రిటిష్ ఇంగ్లీష్ లో honoured అని రాస్తారు. ట్రంప్ ఈ రెండింటిలో ఏదీ కాకుండా, honered రాశారు. ఈ పొరపాటు ఫై నెటిజన్లు నుండి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు రావడంతో ట్రంప్ ఆ ట్వీట్ ను తొలగించి, సరైన స్పెల్లింగ్ తో మరొక ట్వీట్ చేశారు. తనను అమెరికా అధ్యక్షునిగా ఎన్నుకుని ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తనకు లభించిన గౌరవం అని ఈ ట్వీట్లో పేర్కొన్నారు.

Comments