ప్రచురణ తేదీ : Jan 11, 2018 8:42 AM IST

కాంగ్రెస్ బలంపై కన్నేసిన టీఆరెస్ ?

తెలంగాణ రాజకీయాల్లో అసలైన రాజకీయ వ్యూహాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అధికార టీఆరెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలని చాలా పరయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఇప్పుడు కీలకంగా మారాడు. అంతా అతని హయాంలోనే పార్టీ ప్రణాళికలు సిద్దమవుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీలో బాహుబలి రేవంత్ అని కొందరు కార్యకర్తలు సంబదించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే టీఆరెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని ఆ పార్టీ బలంగా ఉన్న స్థానంలో బలమైన క్యాడర్ ని ఏర్పాటు చేయాలనిజ్ చూస్తోంది. మెయిన్ గా కొడంగల్ పరిసర ప్రాంతంలో టీఆరెస్ పార్టీని బలపరచాలని అక్కడి స్థానిక నాయకులతో చర్చలు జరుపుతున్నారట. అయితే రేవంత్ కూడా తన బలాన్ని ఏ మాత్రం తగ్గించుకోకూడదని తన ఆలోచనలో తాను ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గాని టీఆరెస్ మాత్రం కాంగ్రెస్ స్థానాలలో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి జనాలను తనవైపు తీప్పుకోవాలని చూస్తోంది. రాబోయే రోజుల్లో భారీ సభలకు టీఆరెస్ అధిష్టానం ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

Comments