ప్రచురణ తేదీ : Oct 14, 2017 5:38 PM IST

అనంతపురంలో భూ ప్రకంపనలు

అనంతపురం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించిన ఘటన స్థానికులని ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని బెళుగుప్ప మండలం, జీడిపల్లి జలాశయంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు క్రింద పడ్డాయి. దీనితో ప్రజలు బయటకు పరుగులు తీశారు. దాదాపు 9 సెకన్ల పాటు భూమి కంపించింది.

జిల్లాలో భూమి కంపించడం ఈ ఏడాదిలో ఇది రెండవ సారి. బెళుగుప్ప మండలం, జీడిపల్లి జలాశయం ప్రాంతాల్లో సిసి రోడ్లకు పగుళ్లు కూడా సంభవించాయి. కానీ ఎక్కడా ప్రాణ, ఆస్థి నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా జిల్లాలో కొన్ని సెకన్ల పాటు
భూమి కంపించిన విషయం తెలిసిందే.

Comments