ప్రచురణ తేదీ : Thu, Aug 10th, 2017

2029 వరకూ కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉంటారు

తాజాగా మీడియా మిత్రులను కలిసిన సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని.. ఏ పార్టీతో పొత్తు లేకుండా సునాయసంగా గెలవటం పక్కా అన్న ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి తమకు పోటీయే లేదని.. ఇప్పుడున్న స్థానాలు కూడా ఆ పార్టీకి వస్తాయా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇక.. టీడీపీ.. వామపక్షాల ఉనికే లేదని తేల్చేశారు.

అందరూ అనుకున్నట్లు మంత్రి హరీశ్ రావుతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. తమ మధ్య సీఎం పదవికి సంబంధించి ఎలాంటి రేసు లేదన్నారు. 2029 వరకూ కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బలంగా ఉందని.. 50శాతానికి పైగా ఓట్లు తమకొస్తాయన్నారు. కేసీఆర్ ఉన్నంతవరకూ తమకు ఎదురు లేదని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారన్నారు.

Comments