ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

బెట్టింగ్ వెయ్యి కోట్లు… ఓపెన్ చాలెంజ్? నంద్యాలలో గెలుపు మాదే! ఎవరు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నిక రాజకీయంగా రాష్ట్రంలో వేడి పుట్టిస్తుంది. ప్రధాన పార్టీలు రెండు సమ ఉజ్జీలుగా నువ్వా- నేనా అన్నట్లు గెలుపు కూడా విస్తృతంగా ప్రచారం చేయడంతో, అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికలు వచ్చాయంటే అక్కడ డబ్బు ప్రవాహం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. అయితే. అలాగే గెలుపు గురించి రెండు పార్టీల మధ్య భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ బెట్టింగ్ జరుగుతున్న మొత్తం ఎ స్థాయిలో ఉందో తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. సుమారు వెయ్యి కోట్లు మేర రెండు పార్టీల గెలుపు మీద బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇరు పార్టీల్లో కొంత మంది గెలుపు టీడీపీ అని, కాదు గెలుపు వైసీపీది అని బెట్టింగ్ కి రెడీ అయ్యారు. వెయ్యి కోట్లు మేరకు జరుగుతున్నా ఈ బెట్టింగ్ వ్యవహారంలో రాజకీయంగా ప్రముఖులు ఉన్నట్లు కూడా సమాచారం వినిపిస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు, ఎన్నికల సంఘం, నంద్యాల ఎన్నికల మీద ప్రత్యెక ద్రుష్టి పెట్టిన పక్షంలో ఈ బెట్టింగ్ వ్యవహారం ఆగుతుందా లేదా, అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ గా కొనసాగుతుందా అనే విషయం మాత్రం చూడాలి.

Comments