అబ్బ..ఇద్దరు చంద్రులు ఉబ్బితబ్బిబ్బయ్యే గుడ్ న్యూస్..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. కాదు కాదు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ వార్త వలన అందరికన్నా వారికే ఎక్కువ సంతోషం. మా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచండి.. కుయ్యో మొర్రో అని ఈ ఇద్దరు సీఎం లు ఎప్పటి నుంచో వేడుకుంటున్నారు. ఎట్టకేలకు ఆ ఫైలు ప్రధాని నరేంద్ర మోడీ టేబుల్ మీదకు చేరింది. ఆయన ఆమోద ముద్ర వేస్తె చాలు..వచ్చేనెల 15 నుంచి జరగబోతున పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టడం ఖాయం అని అంటున్నారు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే కాదు మరో నాలుగు రాష్ట్రాలు కూడా సీట్లు పెంచాలని అప్లికేషన్ పెట్టుకున్నాయి. ఈ ప్రతిపాదనల్ని క్షుణంగా పరిశీలించిన కేంద్ర హోమ్ శాఖ దానికి సంబందించిన పైల్ ని మోడీ వద్దకు చేర్చిందట. ప్రస్తుతం తెలంగాణాలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ లో 175 స్థానాలు ఉన్నాయి. 119 ని 150 కి పెంచాలనేది కేసీఆర్ కోరిక కాగా.. ఏపీలోని 175 నియోజకవర్గాలని 225 చేయాలని బాబు పట్టు బడుతున్నారు. ఈ ఇద్దరు సీఎం లు ఎప్పుడు ఢిల్లీ టూర్ వేసినా వారి అజెండాలో ఈ అంశం కూడా ఉంటుంది.

ఇదిలా ఉండగా సిక్కిం తన 32 స్థానాలని 40 చేయాలని, ఛత్తీస్ ఘడ్ 90 స్థానాలని 135 చేయాలని, జార్ఖండ్ 81 సీట్లని 125 కి పెంచుకోవాలని, నాగాలాండ్ అసెంబ్లీ సీట్లని 60 నుంచి 90 కి పెంచాలని దరఖాస్తు చేసుకున్నాయి. తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే సీట్ల పెంపు వలన అధికార పార్టీలకే ఎక్కువ లాభం అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా ప్రజా ప్రతినిధులు తెలంగాణాలో టిఆర్ఎస్ లోకి, ఆంధ్రలో టీడీపీలోకి జంప్ అవుతూనే ఉన్నారు. ఉన్న నియోజకవర్గాలలోనే అందరికి సీట్లు కేటాయించాలంటే అధినేతలకు తలనొప్పి వ్యవహారం. అందుకే సీట్లు పెంచాలని అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు మోడీని వేడుకుంటున్నారు. సీట్ల పెంపు వ్యవహారంలో తొలి అడుగు పడడంతో ఇద్దరు సీఎంలు హ్యాపీ.

Comments