ప్రచురణ తేదీ : Dec 4, 2017 7:58 PM IST

రెండో వన్డే తరువాత రిటైర్ కాబోతున్న ధోని !

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంటా అని ఆశ్చర్యపడొద్దు. ఇక్కడ రైటర్ కాబోతోంది ధోని అనే పేరు గల శునకం. ఈ నెల 10 నుంచి శ్రీలంక, ఇండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. మొహాలీలో 13 వ తేదీ రెండవ వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ అనంతరం ధోని రిటైర్మెంట్ అవుతుంది. అయినా శునకం రిటైర్ కావడానికి, వన్డే మ్యాచ్ కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళదాం.

ధోని అనే పేరుగల ఈ శునకం పంజాబ్ పోలీస్ విభాగంలో గత పదేళ్లుగా సేవలందిస్తోంది. ఇక దీనికి విశ్రాంతి కల్పిస్తామని పంజాబ్ పోలీస్ లు చెబుతున్నారు. 2011 ప్రపంచ కప్ టీం ఇండియా, పాక్ ల మధ్య జరిగిన సెమీస్ లో ధోని డాగ్ స్క్వాడ్ విభాగంలో విధులు నిర్వహించింది. అదే మొహాలీ వేదికగా శ్రీలంక, ఇండియా రెండో వన్డే లో దీనికి విశ్రాంతి కల్పిస్తామని అంటున్నారు. ధోని కేవలం పగలు ఆరు గంటలు మాత్రమే నిద్ర పోతుందట. చాలా చురుకైనదని డాగ్ స్క్వాడ్ ఇంచార్జి అక్రిమ్ సింగ్ అన్నారు. ఎవరైనా దత్తత తీసుకుంటే వారికి అప్పగిస్తామని అన్నారు.

Comments